ఉత్పలమాల :
*కట్టడయైన యట్టి నిజ | కర్మము చుట్టుచు వచ్చి యేగతిం*
*బెట్టునో పెట్టినట్లనుభ | వింపక తీరదు; కాళ్ళు మీఁదుగాఁ*
*గిట్టక వ్రేలుఁడంచుఁ దల | క్రిందుగఁ గట్టరె యెవ్వరైన నా*
*చెట్టున గబ్బిలంబులకుఁ | జేరిన కర్మముగాక భాస్కరా!*
*కట్టడ = విధి విహితము (కర్మను బట్టి); చుట్టుచు = ఆవరించుచు*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!
గబ్బిలములను చెట్టుకు తలకిందులుగా ఎవరూ వేలాడ దీయలేదు. కానీ వాటి పూర్వజన్మ వాసనల వల్ల తమంత తామే చెట్టుకు తలక్రిందులుగా వేలాడుతూ వుంటాయి. అలాగే, ఎంతటి వారికైనా పూర్వజన్మ పాపములు చుట్టుకున్నప్పుడు కష్టాలు అనుభవింపక తప్పదు.... అని భాస్కర శతకకారుని వాక్కు.
*మనం జన్మించిన పుణ్య భూమిలో, పూర్వ జన్మ పాపాల ఫలితాలను అనుభవిచడం ఎంత వారికైనా తప్పదు* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
భాస్కర శతకము - పద్యం (౨౮ - 28)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి