అనగనగా ఒక పిచ్చుక. అది దూరని ఇల్లు లేదు. అది వస్తే వద్దనే వ్యక్తిలేడు. చూరు కింద దాని గూడు. మనిషి దానికి కట్టిన ఇంటిపేరు చిల్కమోటి. కొక్కొరొకోతో ఊరుమేలుకుంటే, కిచకిచలతో పిల్లలు లేచేవారు. ఇంట్లోకి వస్తుంటే ఆహ్వానించేవి. ఇంట్లోనుంచి వెళ్తుంటే వీడ్కోలు చెప్పేవి. ఇంటి మనిషిగా కలిసిపోయేవి. అందుకే వరి గొలుసులను జడలుగా కట్టి గూడు ముందు వేళ్లాడదీసేవాళ్లు. అవి ధాన్యం ఒలుచుకు తింటుంటే చూడడమే ఒక ఆనందం. కిందపడ్డ ధాన్యం ఊడ్వడం భారం అనిపించకపోయేది. కళ్ళముందే వాటిగుడ్లు పిల్లలై అరుస్తుంటే ఒక వింత అనుభూతి కలిగేది. బొటన వేలంత కూడా లేని ఆ పిచ్చుక తన పిల్లల పోషణకై పడే తపన చూస్తే హృదయం ద్రవించేది. ఆ పిల్లలు పట్టు తప్పి కింద పడితే వాటి వేదన చూడతరం కాకపోయేది. పిట్ట పిల్లలను అపురూపంగా ఎత్తి గూడులో పెడితే వాటి ఆనందం వర్ణనాతీతంగా ఉండేది. వాటి సందడి ఇంటి నిండా సంగీతాన్ని నింపేది. అదొక సద్గోష్టి.
వ్యవసాయానికి వేసిన రసాయనిక ఎరువులు పిచ్చుకపై బ్రహ్మాస్త్రాలయినవి. కిచకిచలు మూగబోయినవి. అవి చచ్చి ఊరుకున్నవి. ఊరుపేరునే తమపేరుగా చేసుకొని బతికిన పిచ్చుకల పేరేమిటో చెప్పగలవా?
‘‘తెలియదు నువ్వే చెప’’ అన్నాను
‘‘ఊరపిచ్చుక’’ దిగులుగా అన్నడు బుంగి
సద్గోష్టి సిరియునొసగును
సద్గోష్ఠి యెకీర్తి బెంచు సంతుష్టిని నా
సద్గోష్ఠియె యొనగూర్చును
సద్గోష్ఠియె పాపములను జంపుకుమారా
‘‘కుమార శతకం’’
పక్కి లక్ష్మీనరసింహ కవి
సద్గోష్ఠి: -- డాక్టర్ . బి. వి. ఎన్ . స్వామి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి