తేనియలు---జాధవ్ పుండలిక్ రావు పాటిల్--9441333315

శ్రీ గణపతిని మనసార దలచి
విజయదశమి పర్వము నాడు
తెలుగు తేనియలు జాలు వారగ
వ్రాసెద రమణీయంగా నేడు


చదువుల తల్లి సరస్వతీ
కొలచిన వారికి కల్పవల్లి
హంస వాహిని వీణ వాణి
వాసర పురమున వెలసిన తల్లి


పండరి పురమున వెలసిన దేవ
పాండురంగ  పరందామ విఠల
భక్త వత్సల దీన దయాళ
పాండురంగ  పాండురంగ విఠల


ఏడు కొండల వెంకటరమణ
తోడునీడ నీవే స్వామి
తిరుమల తిరుపతి  దేవ దేవ
కలియుగ దైవం నీవే స్వామి


మహిషాసురుని చంపిన తల్లి
జనుల కొరకు వచ్చితివమ్మ
భక్తుల బ్రోచిన శక్తివినీవె
ఇంద్రగిరి కనకదుర్గమ్మ


ఉన్నవారికి అరుగదు తిండి
లేని వారికి దొరకదు మెతుకు
ముల్లెలు మొయుచు సైకిలు తొక్కుతు
జీవితం గడిపిన లేదు మెతుకు