పత్రికల ముచ్చట్లు (వీరాజీ గారితో నేను)--డా .కె .ఎల్.వి.ప్రసాద్ ,--హనంకొండ .9866252002--8886991785

పుస్తకాలు ,పత్రికలు చదవటమే గాని ,పత్రికలలో 
రాయాలనే ,కోరిక ,అవకాశం ,బి.డి.ఎస్ ..లో చేరే 
వరకు రాలేదు .
అన్నయ్య కె .కె .మీనన్ ,తమ ఆఫీసులోని ,సాహిత్య 
సంస్థ ,' రంజని ' నుండి కథల పుస్తకాలు /నవలలు 
ఇంటికి తెచ్చేవారు .వాటిని వెనువెంటనే చదివేసేవాడిని .వదిన గారు ,తన ఆఫీస్ బుక్ క్లబ్ 
నుండి ,బోలెడు పత్రికలు తెచ్చేవారు .అవిధంగా 
అతి చిన్నవయస్సులోనే ,పత్రికలు చదవడం అల _
వాటు అయింది.
ఆ ..రోజుల్లో నేను చదివిన /చూసిన పత్రికలలో ..
ఆంద్ర పత్రిక 
ఆంద్ర ప్రభ 
ఆంద్ర జ్యోతి 
ఆంద్రప్రదేశ్ 
యోజన ,
యువ 
జ్యోతి _మాసపత్రిక 
జయశ్రీ _మాసపత్రిక ......మొదలైనవి.
ఈనాడు దినపత్రిక మొదలయ్యేనాటికి ,నేను బి.డి.
ఎస్ .,లో చేరాను .అప్పట్లో ఆదివారం ప్రత్యేక సంచిక 
పుస్తక రూపంలో ఉండేది కాదు .నాలుగు పేజీల 
ప్రత్యేక అనుబంధం ఉండేది.దానిలో ,సాధారణ 
విజ్ఞాన శాస్త్ర మినీ వ్యాసాలు రాస్తూండేవాడిని.
అప్పుడే ,డా.ఎ .ఎస్ .నారాయణ గారు దంత వైద్య 
విజ్ఞానం ,డా.జి .సమరం గారు ,సెక్స్ సైన్స్ _వ్యాసాలు ,రాస్తుండేవారు.నేను ఒకసారి "కట్టడు ..
పళ్లు అవసరమా ?" అనే చిరు వ్యాసం రాశాను.
అది చదివిన మా అసిస్టెంట్ ప్రొఫెసరు ఒకాయన (ఆయన ఇప్పుడు మనమధ్య లేనందువల్ల వారి 
పేరు ఇక్కడ ప్రస్తావించడం లేదు )" ఇది నువ్వే రాశావా ?"అన్నారు .అప్పుడు ఆయన నన్ను 
ప్రశంసించారో ,విమర్శిస్తూ వెటకారంగా మాట్లాడారో 
నాకు అర్థం కాలేదు గాని ,నాలో ఆయన మాటలు 
ఒక ఉత్ప్రేరకంగా పనిచేసి ,ఇంకా రాయాలనే కసి 
మాత్రం పెరిగింది.అంతే ...మరోవ్యాసం రాసి ఆంద్ర 
పత్రిక ,అదివారం అనుబంధానికి పంపాను.అదే ..
అదివారం,ఆ ..వ్యాసం పత్రికలో ప్రచురింపబడింది .
అప్పుడు ఆంద్ర పత్రిక సంపాదకులు ,శ్రీ వీరాజి గారు 
ఆయనతో నాకు పరిచయం లేదు .అలాగే నేను 
ఎవరో ..ఆయన ఎరుగరు.నేను రాసి న ,ప్రతి వ్యాసము,కవిత ,అలా అచ్చయి పోతుండేవి.అలా 
ఒక పదివ్యాసాలు వచ్చాక ,వీరాజి గారిని చూడ 
డానికి,విజయవాడ ఆంద్ర పత్రిక ఆఫీసుకి వెళ్లి నన్ను 
నేను పరిచయం చేసుకున్నాను.నన్ను చూసిన 
ఆయన "..మీరా ..ఎవరో పెద్దాయన అనుకున్నాను "
అని నవ్వి ,కూర్చోబెట్టి ఎంతో అత్మీయంగా మాట్లాడారు .తరువాత ఎప్పుడయినా మా అత్త ..
గారి ఇంటికి విజయవాడ వెళ్ళినప్పుడు,తప్పకుండా 
వీరాజి గారిని ,సత్యన్నారాయణ పురంలో ,వారి 
స్వగృహంలో ,కలుస్తుండేవాడిని.
ఆయన సంపాద కత్వం లో ,వెలువడిన ,ఆంధ్రపత్రిక 
దినపత్రిక,వార పత్రిక ,మహిళలకోసం ,కలువబాల ,
పిల్లల పత్రిక ,బాలరంజని ,పత్రికలలో వ్యాసాలు ,
కవితలు (ఒక కార్టూను కూడా !)రాసాను.నా జీవితంలో ,మరచిపోలేని /మరచిపోకూడని ,
మహానుభావులలో ' వీరాజి 'గారు ఒకరు !!
ఆయన ఇప్పుడు హైదరాబాద్ లో ,పిల్లలతో ,
విశ్రాంతి జీవితం గడుపుతున్నారు.