హాస్య నటుడు వల్లూరి బాలకృష్ణ .--డా.బెల్లంకొండనాగేశ్వరరావు.9884429899.

నేటి ప్రకాశం జిల్లా లోని ఉప్పుగుండూరు లొ  ఆగస్టుమాసం1925 లో బాలకృష్ణ  జన్మించారు.వీరి తాత గారు కరణం.నాటక రంగం మీద అభిమానంతో చదువుకు డుమ్ముకొట్టి,ఏలూరు లోని తండ్రి వద్దకు చేరి నాటకాల కంపెనీలలో చిన్నావేషాలు వేస్తూ జీవించ సాగాడు.
అలా మద్రాసు జార్జిటౌన్ లొ బాలకృష్ణ 'తారాశశంకం'నాటకం లో నటిస్తూ సిని దర్మకులు చిత్తజల్లు పుల్లయ్యగారి దృష్టికి రావడంతో  'శ్రీకృష్ణతులాభారం'  (1955)చిత్రంలో గోకుల బాలుని వేషం ఇచ్చారు. రేలంగి, శాంతకుమారి,బుష్యేంద్రమణి,లక్ష్మిరాజ్యం వంటి వారు ఆచిత్రంలొ తొలాసారి నటించారు.కాంచనమాల కూడా ఈ చిత్రంలో మిత్రవిందగా కనిపిస్తారు.ఈచిత్రం 12/4/1935.విదుదల జరిగింది.
సినిమాలు లేక ఏలూరులోని తాలూకా ఆఫీసులో గుమ్మస్తా ఉద్యోగం చేయసాగాడు.అలా కొంతకాలం గడచిన అనంతరం మద్రాసు వాహినీ వారి ఉత్తరం,మనియార్డరు వచ్చాయి.మేము నిర్మించబోఏ చిత్రాలలో పర్మినెంట్ ఆర్టిస్టుగా మిమ్మల్ని నెలజీతం పై తీసుకుంటున్నాము,భోజనం,వసతి కూడా ఉంటుంది అన్నది ఆఉత్తరం సారాశం.
వెంటనే మద్రాసు వాహిని వారి ఆఫీస్ చేరాడు."గుణసుందరికధ"(1949)కు జూనియర్ శ్రీరంజని పక్కన ధైవాదీనం పాత్రకు మేకప్ టెస్టుజరిపారు.బాలకృష్ణ బదులు ఆపాత్రకు కస్తూరి శివరావుని తీసుకున్నారు.అనంతరం "షావుకారు" (1950)చిత్రంలో ఎస్.వి.రంగారావు గారితో నాలుగు సార్లు డైలాగ్ లేకుండా కనిపించారు."పాతాళభైరవి" (1951)చిత్రంలో నంమూరి వారి సహచరుడిగా అంజి పేరున పరిచయం అయ్యాడు.అ"పెళ్ళిచేసిచూడు" (1952) "చంద్రాహారం"(1954)" మిస్సమ్మ " (1955)చిత్రాల అనంతరం వారి అగ్రిమెంట్ ముగిసింది.
అలా "ముందడుగు"(1958)" ప్రతిజ్జాపాలన" (1965) "అగ్గిబరాట"(1966) "లక్ష్మికటాక్షం"  "అగ్గిపిడుగు"(1964) "గురువును మించిన శిష్యుడు"(1963) "పిడుగురాముడు"( 1966)"జ్వాలాదీపరహస్యం"(1965) "సువర్ణసుందరి"(1957) "గుళేబకావళికథ"(1962)"కనకదుర్గపూజామహిమ"(1960) "నవగ్రహపూజామహిమ"(1964)"కలసిఉంటే కలదుసుఖః"(1961) "మదనకామరాజుకథ"(1962)"బొబ్బిలియుథ్థం"(1963) "మర్మయోగి"(1964) "పరమానందయ్య శిష్యులకథ" (1966) "గుండమ్మకథ"(1962)వంటివందల చిత్రాలలో నటించాడు. విఠలాచార్య గారి ఆశీస్సులు  లభించడంతో,నటి జీవితంలో బిజీగా మారాడు. సొంత ఇల్లు,కారు ఏర్పడ్డాయి.రోజుకు రెండు చిత్రాల్లో నటిస్తూ పనివత్తిడికి లోనై 
మందుబాబుగా మారాడు.మతిస్ధిమితం తప్పింది అతివాగుడు అందరిని ఎదిరించడం తిట్టడం ప్రారంభించాడు. చేతిలో సినిమాలు లేవు,అందరూ దూరమయ్యారు.ఎదిగిన ఏడుగురు ఆడపిల్లలను అన్యాయంచేస్తూ,మందు బాబులకు తన జీవితం గుణపాఠంగా చూపించి శాశ్విత నిద్రలో ఒరిగి పోయాడు.