మనుమరాలు(మాఅమ్మ)-చెన్నమనేని ప్రేమసాగర్ రావు

కల్మషము లేనట్టి 
ఆత్మీయ పిలుపు 
మధురిమలొలకించే
వీణాతరంగాలు 


గోపాలుని వేణుగానం
గోవులను దరిజేర్చు 
మాఅమ్మ పిలిచి 
మాఒడి జేరు 


ముచ్ఛట్లు మురిపాలు 
మదియెంతో పులకించు 
తొందరేమి లేదు 
తొట్రుపాటు లేదు 


కబుర్లలో మునిగితే 
కాలమే తెలువదు


కామెంట్‌లు