శ్రద్దావాన్ లభతే జ్ఞానం--కె ఎస్ అనంతాచార్య

పదవిని పొందటం కీర్తి నందటoకోసం కఠోర పరిశ్రమలో కాయాన్ని ముక్కలు చేసుకోవటంతో పాటు
బుద్ధి కుశలతను జోడించి వినమ్రత తో తలవంచడం 


అరుదైన దానిని అందడం కోసం మనస్సoకల్పంతో  ఉడుం పట్టు పట్టి జయ కేతనం ఎగురేయడానికి  కారణమైన మంత్ర కౌశలం


లక్ష్య సిద్ధి,చిత్తశుద్ధి తో ఆచరించే ఒకానొక యోగ కర్మ మే జ్ఞానాధ్యయన మర్మం


నిరంతర అధ్యయనం దృఢసంకల్పం ఆత్మ విశ్వాసం తో అందలమెక్కే విశ్వ రహస్యం


తెలుసుకున్న కొద్దీ దూరమయ్యే అజ్ఞానం నిరంతర సాధనతో చేరువయ్యే లక్ష్యసాధన


ఏటిని పడవ దాటించినట్లు గా అవిజ్ఞతను అధిగమిoప చేసే జీవ సాధనం గురువే జ్ఞాన మార్గపు రుజువు


ఒక పుస్తకం చాలు మస్తిష్కం లోని దుమ్ము దులపడానికి
ప్రదేశం ఒకటి చాలు సంస్కృతి అద్దటానికి 
అంధకారాన్ని బంధించి జ్ఞాన దివ్వె వెలిగించటానికి గురువొక్కరు చాలు


నీటి లోకి దిగితే లోతు అవగత మవుతుంది
వస్తువులతో మమేకమైనప్పుడే  పదార్థ రచన తెలుస్తుంది


జ్ఞానం ఒక విద్యుత్తు
శ్రద్ధగా వాడితే బల్బు వెలుగుతుంది వదిలేస్తే జీవితాన్ని మింగేస్తుంది