సాత్యకి కృష్ణుని భక్తుడు. ఇతను అర్జునునితో కలసి ద్రోణుని వద్ద యుద్ధ విద్యలు అభ్యసించాడు. సాత్యకి, అర్జునుడు మంచి స్నేహితులు. సాత్యకి తండ్రి సాత్యక. ఇతను కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులతో కలసి కౌరవులపై యుద్ధం చేశాడు. సాత్యకి, కృతవర్మలు కురుక్షేత్ర సంగ్రామంలో పోరాడిన యాదవ వీరులలో ముఖ్యులు. వీరిలో సాత్యకి పాండవుల వైపు, కృతవర్మ కౌరవుల వైపు పోరాడారు. యుద్ధంలో ఒకసారి ద్రోణుని విల్లుని 101 సార్లు విరచి అతనిని ఆశ్చర్యపరిచాడు. సాత్యకి, కృతవర్మ ఇద్దరూ బ్రతికారు. కృతవర్మ కృపాచార్యుడు, అశ్వద్దామలతో కలసి రాత్రి వేళ పాండవుల కుమారులను నిద్రిస్తున్నప్పుడు చంపుటలో పాల్గొన్నాడు. 36 ఏళ్ల తరువాత ఒకరోజు రాత్రి జరిగిన పోరాటంలో సాత్యకి నిద్రపోతున్న సైనికులను చంపావని కృతవర్మని, కృతవర్మ నిరాయుధుడైన భూరిశ్రవుని చంపావని సాత్యకిని పరస్పరం నిందించుకొన్నారు. ఆ యుద్ధములో సాత్యకి, కృతవర్మ, మిగిలిన యాదవ వంశం మొత్తం గాంధారి శాపం మూలంగా నాశనం అయింది.సాత్యకికి యుయూధనుడు అను పేరు కూడా ఉంది.
సాత్యకి..!---సుజాత.పి.వి.ఎల్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి