టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ

అప్పట్లో అమృత బజార్ అనే పత్రిక రెండు భాషల్లో ప్రచురించబడుతుండేది.ఆ పత్రికలో తాతయ్య రాసిన హిందూ మేలా ఊహత్ అనే పుస్తకాన్ని ప్రచురించారు.తాతయ్య తాను రాసిన పద్యాలను, గీతాలను,వాళ్ళ ఇంటికి వచ్చే గొప్ప గొప్ప పత్రికా సంపాదకులకు, కవులకు, విమర్శకులకు చాలా ఉత్సాహంగా చదివి వినిపించే వాడు.
                    తాతయ్య అహ్మదాబాద్ లో తన పెద్దన్న సంత్యేంద్రుని ఇంట్లో కొన్నాళ్ళు వున్నాడు.సంత్యేంద్రుడు నివసించే ఇల్లు చాలా పెద్ద మేడ.దానిపేరు షాహీబాగ్ అది పూర్వ కాలపు రాజు కుటీంబీకులకు చెందిన మహల్ అయివుంటుంది.ఆ ఇంటికి చూసాకా కళాపిపాసి అయిన తాతయ్య పూర్వకాలపు మొగల్ చక్రవర్తుల ధర్భారులు-చరిత్ర, జ్ఞాపకం వచ్చాయి.ఆ జ్ఞాపకమే తాను కావ్య జగత్తులో,ప్రవేశించిన తరువాత హంగరీ స్టోన్స్ అనే పుస్తకం రాయడానికి ప్రోత్సాహకారి అయింది.ఆ పుస్తకంలో పూర్వ కాలపు మేడల్లో నివాసం వుండే యువకుడైన ఒక అధికారి భావాలు,సాహాసకృత్యాలు వర్ణింపబడ్డాయి.
                    ఆ తరువాత తాతయ్య తన ఇంకో అన్నయ్య జ్యోతీంద్రుని ఇంటికి వెళ్ళాడు.ఆయన అప్పుడు కలకత్తాకు దగ్గర లో వున్న, చంద్ర నగర్ లో వుంటుండేవాడు.ఆ ఊరు గంగానది తీరంలో వుండేది.ఆ ప్రదేశం తాతయ్యకు చాలా నచ్చింది.గంగానదిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్య కిరణాల వల్ల కలుగుతున్న,రంగుల మార్పులు,రాత్రి పూట చంద్రుడు,ఆ వెలుగు,కనిపిస్తూ వుంటే పొందిన ఆనందం కవి హృదయంలో, కమ్మని కథా వస్తువులు కవిత్వపు తరంగాలుగా మారి, ఉప్పొంగి వచ్చేవి.ఆ తరంగాలే,సంధ్యా గీతాలు గా ప్రచురింపబడ్డాయి.ఈ పుస్తకాన్ని రచించిన తరువాత, బెంగాలీ రచయితల్లో, తాతయ్యకు గొప్ప పేరు ప్రఖ్యాతులు లభించాయి.బంకించంద్రచటర్జీ లాంటి గొప్ప రచయితలు, తాతయ్యను,ఒక పెళ్లిలో కలుసుకున్నప్పుడు పూలమాల వేసి గౌరవించారు.
మిగితాది రేపు....