అబ్బబ్బో చలి పులి
వణికిస్తున్న బొబ్బిలి
కాళ్ళు, చేతులు వంకరలు
శరీరమంతా గజగజ
ఇళ్ళు నిండిన చలిగాలులు
స్వెటర్, దుప్పట్లు సన్నిహితులు
మూలన చేరిరి పిన్నపెద్దలు
మక్కలు, బబ్బేర్ల పరపరలు
వేడి వంటలతో చకచకలు
పగలు రాత్రిలా మబ్బులు
మంచు వానతో పదనిసలు
చెట్టు పుట్టలు నివరుతో దడదడలు
చలి పులి కౌగిట్లో నివాసాలు
సూర్యకాంతికై తహతహలు
పల్లెలు మంటలతో సరిగమలు
ఎండతోని జనులు తిరిగి హుషారు
చలి పులి:--ఉండ్రాళ్ళ రాజేశం-సిద్దిపేట
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి