భాస్కర శతకము - పద్యం (౬౭ - 67)

ఉత్పలమాల : 
*పూనిన భాగ్యరేఖ చెడి |  పోయినపిమ్మట నెట్టి మానవుం*
*డైనను వాని నెవ్వరుఁ బ్రి |  *యంబునఁ బల్కరు పిల్వ రెచ్చటం*
*దానది యెట్లొకో యనినఁ | దథ్యము పుష్పము వాడి వాసనా*
*హీనత నొందియున్న యెడ | నెవ్వరు ముట్టుదురయ్య భాస్కరా!*


తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన, భాస్కరా..


అదృష్టం తక్కువ అయి, భాగ్యవంతుడు బీదవాడు అయినప్పుడు, అతనిని ఎవరు కూడా పలుకరించరు, బంధువులు ఇంటికి కూడా రమ్మనరు. అటువంటి అదృష్ట హీనుణ్ణి అందరూ దూరం పెడతారు.  ఎలా అంటే, వాసన లేక, నలిగి, వాడి పోయిన పూలను ఎవరూ చేతిలోకి తీసుకొని ఉపయోగించరు కదా.....అని భాస్కర శతకకారుని వాక్కు. 


*"పూవులు అమ్మిన చోట కట్టెలు అమ్మటం"  అంటే ఇదే కదా.  కానీ, ఇటువంటి వారిని సమాజంలో అందరూ, ముఖ్యంగా వారి బంధువర్గం చేరదీయవలసిన అవసరం ఎంతైన ఉంటుంది. ఆ సమయంలో వారికి కావలసినది కొంచెం ఆత్మస్థైర్యం, ఇంకొంచెం ఆలంబన.  ధనము, సంపదలతో కొనలేనివి మన చుట్టూ చాలా వున్నాయి అని గుర్తించ గలగటం.* ఇది సత్యం.


.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss


కామెంట్‌లు