ఉత్పలమాల :
*భూపతికాత్మ బుద్ధి మది | బుట్టనిచోటఁ బ్రధాను లెంత ప్ర*
*జ్ఞాపరిపూర్ణులైనఁ గొన | సాగదు కార్యము; కార్యదక్షులై*
*యోపిన ద్రోణ భీష్మ కృప | యోధు లనేకులు కూడి కౌరవ*
*క్ష్మాపతి కార్యమేమయిన | జాలిరె చేయఁగ వారు భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన, భాస్కరా..
మంచి చెడులను బేరీజు వేసుకొనలేని మూర్ఖుడైన దుర్యోధనుని దగ్గర కర్తవ్య పరాయణులు ద్రోణ, భీష్మ, కృపాచార్యులు వుండి కూడా మహారాజు కార్యము చేయలేక పోయారు. అలాగే, ఎంతమంది ప్రజ్ఞా పాటవాలు వున్న మంత్రులు వున్నా, రాజు స్వయంగా ఆలోచనాపరుడు, బుద్ధిమంతుడు కాకపోతే ఆ మంత్రలవల్ల రాజు కు ఏపనీ కూడా అవదు.....అని భాస్కర శతకకారుని వాక్కు.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి