భాస్కర శతకము - పద్యం (౮౯ - 89)

 ఉత్పలమాల: 
 *లోనుదృఢంబుగాని పెను | లోభిని నమ్మి యసాధ్యకార్యముల్*
*కానక పూనునే నతడు | గ్రక్కునఁ గూలును నోటిపుట్టిపై*
*మానవుఁడెక్కిపోవ నొక | మాటు బుటుక్కున ముంపకుండునే*
*తానొక లోఁతునం గెడపి | దానిఁ దరింపఁగ లేక భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన, భాస్కరా..
నీటిలో ప్రయాణం చేయడానికి పుట్టి (బుల్లి పడవ) ఒక సాధనం. అలాంటి పుట్టి మీద ప్రయాణం చేస్తూ బాగా లోతువున్న నదిని దాటే ప్రయత్నం చేస్తే, పుట్టి మునుగుతుంది, మన ప్రాణాలు పోతాయి.  అలాగే, ఏమాత్రమూ సామర్థ్యం లేని, నిర్బలుడైన వ్యక్తిని నమ్ముకుని, ఒక పెద్ద పనిని పూర్తి చెయ్యాలి అని అనుకుంటే, ఆ పని పూర్తి అవుదు సరకదా, అప్పటి దాకా అయిన పని కూడా చెడిపోతుంది....అని భాస్కర శతకకారుని వాక్కు.
*ఒక కార్య సాధన కోసం, ఒకరి సహాయం అడిగేటప్పుడు, మనం చేయాలనుకున్న పని యొక్క లక్ష్యాన్ని తెలుసుకుని, ఆ లక్ష్యం సాధించడానికి ఎదుటి వ్యక్తి నిజంగా ఉపయోపడగలడా, మనకు మనస్ఫూర్తిగా సహాయం చేస్తాడా అని ఆలోచించుకుని, అతని సమర్ధత తెలుసుకుని సహాయం అడగాలి* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss