ఒకరికొకరు: -యన్.ఇమామ్ వలీ. 8వతరగతి.కొత్తపేట

 అనగనగా చిలుమకూరనే గ్రామం ఉంది.అక్కడ ఉన్నతపాఠశాల ఉంది.
ఆ పాఠశాలలో నాగార్జున,నరేంద్ర ఎనిమిదవ తరగతి చదువుతున్నారు.
నాగార్జునకు గణితం.ఇంగ్లీషు బాగా వచ్చు.
నరేంద్రకు తెలుగు,సైన్స్,హిందీ బాగా వచ్చు.
ఇద్దరూ ఒకరికి తెలిసిన విషయాలు మరొకరికి చెప్పుకుంటూ కలిసి చదువుకునేవారు.పరీక్షల్లోఇద్దరికీ అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చేవి.
వారి స్నేహాన్ని చూసి ఓర్వలేని వాళ్ళు చెప్పిన చాడీలవల్ల ఇద్దరూ గొడవపడి మాట్లాడుకోవడం మానుకున్నారు.కలిసి చర్చించుకుంటూ చదవకపోవడంవల్ల ఇద్దరూ పరీక్షలు బాగా రాయలేక పోయారు.
తక్కువ మార్కులొచ్చాయి.అదిచూసి వారిమధ్య గొడవ పెట్టిన వాళ్ళు సంతోషించారు.ఈ విషయం వంశీ అనే పిల్లవాడు వాళ్ళకి చెప్పాడు.వాళ్ళు తప్పు
తెలుసుకుని వంశీ ద్వారా తిరిగి కలిసిపోయారు.చెప్పుడు మాటలు చేటు.కలిసిఉంటే కలదుసుఖమని గుర్తించారు.వంశీని కూడా వారితో  కలుపుకున్నారు.చెప్పుడు మాటలు వినకుండా ,కలిసిమెలిసి  చదువుకుంటూ మంచిపేరు సంపాదించుకున్నారు.
(డి.కె.చదువులబాబు సంపాదకత్వంలో పిల్లలు వ్రాసిన కొత్తపేటకలాలు కథలసంకలనంలోని కథ) 
కామెంట్‌లు