*భాస్కర శతకము* - పద్యం (౯౨ - 92)

  ఉత్పలమాల: 
 *వలనుగఁ కానలందు బ్రతి | వర్షమునం బులి నాలుగైదు పి*
*ల్లఁగను దూడనొక్కటి ని | లంగను ధేనువు రెండు మూడు నేఁ*
*డుల కటులైన బెబ్బులి కు | టుంబము లల్పములాయె నాలమం*
*దలు గడువృద్ధిఁ జెందవె య |  ధర్మము ధర్మము దెల్ప భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన, భాస్కరా..
అడవులలో పులి సంవత్సరంలో నాలుగు ఐదు పిల్లలను కంటుంది. కానీ అవి అన్యాయమైన హింసా ప్రవృత్తి గలవి. కనుక పులుల సంఖ్య మితమగా వుండి వంశం అభివృద్ధి చెందదు.  ధర్మ మార్గములో వుండే ఆవులు మూడేసి సంవత్సరాల లో ఒక లేగను కనినా ఆవుల సంపద పెరుగుతుంది. వంశాభివృద్ధి జరుగుతుంది....అని భాస్కర శతకకారుని వాక్కు.
*ధర్మమైన పద్దతి లో చేసే ఏపని అయినా చక్కగా పూర్తి అయ్యి వృద్ధి కి కారణము అవుతుంది.  అలాగే, ధర్మాన్ని నమ్ముకుని నడుచుకునే వ్యక్తి కూడా అభివృద్ధి వైపే ప్రయాణిస్తాడు*  అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు