'ఆ ' ఇద్దరు : - టి. వేదాంత సూరి


 ఈ రోజు క్రిస్మస్ కదా.! అంతే కాదు వైకుంఠ ఏకాదశి, గీత జయంతి. ఈ రోజే, శుభ శుక్రవారం, అన్ని మతాల వారికీ పండుగ రోజే కదూ. మరి ఈ సందర్బంగా అందరికి శుభాకాంక్షలు. 
ఇక్కడ ఒక విశేషం చెప్పు కుందాం, ప్రపంచమంతా క్రిస్మస్  శీతాకాలం లో జరుపుకుంటారు , కానీ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లలో ఇది వేసవి లో వస్తుంది. అయినా భారత దేశంలో  లో ఉన్నట్టు , చర్చీలలో ఏమీ హంగామా ఉండదు. ఎవరి ఇంటి వద్ద వారు జరుపుకుంటారు. 
దుకాణాలు, కార్యాలయాలు అన్నీ  మూసి ఉంచుతారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉంటాయి. 
సికింద్రాబాద్ లో సెయింట్ మేరీ , సెయింట్ జార్జ్ చర్చ్ లు ఎంతో సందడిగా ఉంటాయి కదూ. కానీ ఇక్కడ ఆ అలజడే కనిపించదు, స్నేహితులు, బంధువులతో ఇంటివద్దే  విందులు చేసుకుంటారు. 
ఈ మధ్య  డే కేర్ లో జరిగిన క్రిస్మస్  వేడుకల్లో క్రిస్మస్ శాంతా వద్ద ఆద్య మంచి కథల పుస్తకం బహుమతిగా అందుకుంది. 
వేసవి సెలవులు కదా. ఆద్య , ఆరియా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించు కున్నారు.. అవేంటో రేపు తెలుసుకుందాం. 
(మరిన్ని ముచ్చట్లతో రేపు కలుద్దాం )