మరో కొత్త అడుగు : జగదీశ్ యామిజాల

 మరో కొత్తసంవత్సరం
మన జీవితంలోకి 
అడుగుపెట్టింది.....
మనం తీసుకోబోయే
తీర్మానాలు
మన ముందడుగుకు
మన ఆయురారోగ్యాలకూ
దోహదపడాలి
కొత్త ఆలోచనలు
కొత్త ప్రయత్నాలు
కొత్త బంధాలు
కొత్త అనుభూతులు
కొత్త నమ్మకాలు
అన్నీనూ
వికసించాలి ...
రానున్న రోజులన్నీ 
మనకైన రోజులే అనే నమ్మకంతో
వాటిని అద్భుతంగా మలచుకోవడం మార్చుకోవడం 
మన చేతుల్లో ఉన్నదే....
మంచినే తలుద్దాం
పరస్పరం మంచి నడవడితో
ముందుకు సాగుదాం
గతించిన సంవత్సరాన్ని 
తలుస్తూ కూర్చోడం కన్నా
అవి నేర్పిన పాఠాలనూ
ఇచ్చిన అనుభవాలనూ
మనసులో ఉంచుకుని
కొత్త సంవత్సరాన్ని 
మధురమైనదిగా మార్చుకుందాం
జీవితమనే బ్యాంకులో 
రాబడి అయిన కొత్త సంవత్సరం మొత్తాన్ని 
ఆచి తూచి ఖర్చు పెడుతూ 
ముందుకు సాగుదాం
రోజులు కూడితే 
మన ఆయుస్సులో రోజులు తగ్గుతుంది
ఇది జీవిత లెక్క
ఏదేమైనా 
అన్నీ మంచి రోజులుగా భావిస్తూ 
పురోగమించాలని 
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
అందిస్తున్నా