ఈ సమయంలో ఇతరులతో పరిచయం కావడం, ఆడుకోవడం , వివిధ ప్రదేశాలు చూడటం వంటివి జ్ఞాపకాలలో పదిల పరచుకుంటారుఆద్య , ఆరియా , వాళ్ళ స్నేహితురాలు యుధిష్ట వెల్లింగ్టన్ లోని ఎన్నెన్నో ప్రదేశాలు తిరిగి చూసారు.న్యూజిలాండ్ రాజధాని నగరం కాబట్టి అక్కడ పార్లమెంట్ భవనం వుంది. దాన్ని చూసారు. ఎన్ని భూ కంపాలు వచ్చినా చెక్కు చెదరకుండా ఉండేలా ఈ భవనాన్ని నిర్మించారు.అంతే కాకుండా విక్టోరియా లుక్ అప్, కిడ్స్ పార్క్ , వాటర్ ఫ్రంట్, బీచ్ కు వెళ్లారు. కిడ్స్ పార్క్ లో పిల్లలు ఆనందించారు. వారికోసం ఏర్పాటు చేసిన కార్లు ఎక్కి సరదాగా తిరిగారు.ఎక్కడికి వెళ్లినా పిల్లలు ఆనందం తో చిందులు వేశారు. ప్రకృతి అంటే పెద్దలకే కాదు పిల్లలకూ చాలా ఇష్టం, రాత్రి అయ్యే వరకు వారి పర్యటన సజావుగా సాగింది. వారి ఆనందం హద్దులు దాటింది. చాలా అలసి పోయారు ముగ్గురు పిల్లలు ఆడుతూ పడుకున్నారు.( మిగతా ముచ్చట్లు రేపు )
' ఆ ' ఇద్దరు : - టి. వేదాంత సూరి .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి