' ఆ ' ఇద్దరు :- టి. వేదాంత సూరి

 ఆక్లాండ్ లో బయలు దేరిన ఆద్య, ఆరియా హామిల్టన్ చేరుకొని అక్కడ రాహుల్ అంకుల్ ఇంట్లో స్టాబెరి పళ్ళ చెట్టు ఉంటె ఇష్టమైనన్నీ పళ్ళు తిన్నారట. అక్కడ ఒక గంట గడిపి మళ్ళీ  టౌపో బయలు దేరారు. అక్కడ రూమ్ లో దిగాక హుక్కా ఫాల్స్ చూసి వచ్చారు. సాయంకాలం లేక్ టౌపో కు వెళ్లి వచ్చారు. 
వాట్స్ అప్ వీడియో కాల్ చేసి తమ పథకాలను , గదులను చూపించారు ఆద్య, ఆరియా, ఇక ఆరోజు రాత్రి పడుకుని మరు నాడు అంటే ఆది వారం వెల్లింగ్టన్ బయలు దేరారు. 
పిల్లలకు ఎప్పుడూ ఒకే చోట ఉంటడటం కంటే ఇలా వీలున్నప్పుడు బయటకు  తీసుకు వెళితే ఆట విడుపుగా ఉంటుంది. అందుకే ఈ ప్రయాణం. ఎక్కువగా చెప్పకుండా మీకోసం ఇక్కడ ఫోటో లు పెడుతున్నాను . 
(మిగతా ముచ్చట్లు రేపు )