ఒక ఊరి పొలిమేరలో ఆడ శునకం కూనల్ని ప్రసవిస్తోంది. రెండు కూనలు సక్రమంగా ప్రసవం జరగ్గా మూడవ కూన గర్భంలో అడ్డుతిరిగి ప్రసవం జరగక యాతన అనుభవిస్తోంది. అది గమనించినబాబా దగ్గరకు రాగానే భయపడి కరవడానికి ప్రయత్నిస్తోంది .బాబా తన భుజానికున్న జోలి లోంచి ఒక రొట్టె ముక్కని దాని నోటిముందు ఉంచి మెల్లగా దగ్గరకు వెళ్ళి ఒక చేత్తో దాని మూతిని బంధించిరెండవ చేత్తో శునక మర్మాంగంలో చేతిని ఉంచి అడ్డు తిరిగిన కూననిమెల్లగా బయటకు లాగి తన తల మీదున్న అంగవస్త్రాన్ని అడ్డుగా ఉంచిరక్త స్రావాన్ని నిలువరించ గలిగాడు. కూనల్ని తల్లి పొదుగుల వద్ద చేర్చిపాలను తాగేలా చేసారు. కొద్ది సమయం తర్వాత రక్త స్రావం నిలిచి పోగా అంగవస్త్రాన్ని తొలగించి చేతుల్ని మట్టితో శుభ్రం చేసుకున్నారు.శునకం కూనలు పాలు కుడుస్తూంటే మాతృ మమకారంతో తనబాధని మరిచి పోయింది. బాబా తన దారిన ముందుకు సాగిపోయారు.మరికొద్ది రోజుల తర్వాత సాయిబాబా ఆ దారంట వెల్తూంటేఎక్కడి నుంచో తల్లి శునకం తన కూనలతో పరుగున వచ్చి బాబాకాళ్లని నాకడం మొదలెట్టింది. బాబా దాని విశ్వాసానికి మురిసిపోయిభుజానికున్న జోలెనుంచి రొట్టె ముక్కలు తీసి దాని నోటి కందించారు.* * *
విశ్వాసం కథ : -- కందర్ప మూర్తి, హైదరాబాదు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి