'ఆ' ఇద్దరు :- టి. వేదాంత సూరి

 అనగనగనగా ఈ ప్రపంచం లో ఒక చిన్న ద్వీపం. ఇది చిన్నదే కానీ అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది. ఆ ద్వీపం పేరు ఏమిటంటే న్యూజిలాండ్. ఈ దేశం లో ఆక్లాండ్ అనే పట్టణం వుంది.ఇక్కడ ఆద్య, ఆరియా పేరుగల   అక్కా, చెల్లి వుంటారు. వారిద్దరు అల్లరి చేస్తారు, ఆడుకుంటారు, ఏడుస్తారు, నవ్వుతారు. పోట్లాడుకుంటారు. మాట్లాడుకుంటారు. ఆద్య వయసు నాలుగేళ్లు , ఆరియ వయసు వచ్చే నెలలో రెండేళ్లు నిండుతాయి. మరి వారి కబుర్లు మనం ప్రతి రోజు తెలుసుకుందామా ? ఏం చేస్తుంటారు ? ఎలా ఆడుకుంటారు ? వంటివి ఎన్నెన్నో రోజూ చెప్పుకుందాం. మరి మీరు మాత్రం వారి కబుర్లు మరిచి పోకుండా చదవండి . సరేనా ! ( మిగతా ముచ్చట్లు రేపు )