రేపటికోసం ..: -----డా.కె .ఎల్.వి.ప్రసాద్ -- హన్మకొండ .

 శ్రమించడంలో 
స్త్రీపురుష భేదంలేని ,
కర్షకలోకంలో 
స్ర్తీ మూర్తి సైతం 
హాలంపట్టి 
పొలందున్నుతున్న 
ఈ ఆధునిక కాలంలో 
రైతుల పరిస్థితి 
దినదిన గండం -
నూరేళ్ల ఆయుష్షు ఐంది !
అవసరం లేనప్పుడు 
కుండపోత వర్షాలు ,
అవసరంవున్నప్పుడు 
చినుకు రాల్చని మేఘాలు 
రోజురోజుకీ రైతుబ్రతుకు ,
ప్రభుత్వాల దృష్టికి రాని 
పనికిరాని అంశం ఐంది !
ప్రభుత్వ పథకాలన్నీ 
ప్రక్కదారి పట్టి 
ప్రజల దృష్టి పక్కకు నెట్టి ,
ఉన్నవాళ్లే అన్నీ 
దున్నుకుంటున్న 
పాడుకాలం ఇది !
తిండిపెడుతున్న 
త్యాగమూర్తులను 
అశ్రద్ద చేయడం 
న్యాయంకాదు .....!
రేపటి ఆర్థిక భవిష్యత్తుకు 
ఆటంకాలు పెట్టడం ,
ముమ్మాటికీ సరికాదు ...!!