పల్లెల్లో ఆనందము :- M. అన్విక -8వ తరగతి -జి.ప.ఉ.పా తొగుట-తొగుట మండలం -సిద్దిపేట జిల్లా.

 నా పేరు అన్విక , 8వ తరగతి చదువు పూర్తయ్యింది .జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొగుట , మేము ఎండాకాలం సెలవుల్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా పిన్ని, బాబాయి ,చెల్లి ,తమ్ముడు, పెద్దమ్మ ,పెద్దనాన్న ,అక్క ,అన్న అందరూ వచ్చారు. మేము మా అమ్మ నాన్న నేన వెళ్ళాం. అందరమూ ఆనందంగా కలుసుకున్నాం .మరుసటి రోజు మా అమ్మమ్మ వాళ్ళ తోటకి వెళ్ళాము తోటలో మా అమ్మమ్మ పెంచిన చెట్లు ,కొబ్బరి చెట్లు ,నీళ్ల బాయి కూడా ఉన్నాయి. మా తాతయ్య కొబ్బరి చెట్టు ఎక్కాడు .అందరికీ కొబ్బరికాయలు తెంపగా చిన్న కొబ్బరికాయ మా చిన్ని తమ్ముడు పట్టుకున్నాడు. మా తాతయ్య కిందికి దిగి అందరికీ కొబ్బరి కాయలు కొట్టి ఇచ్చాడు.
కొబ్బ నీళ్ళు తాగాము. మా అమ్మ ,అత్తమ్మ ,చెట్టు కింద చక్కగా వంట చేశారు. పచ్చని చెట్ల మధ్య  కూర్చొని అందరమూ భోజనం చేస్తూ.... మా అమ్మమ్మ అందరికీ వడ్డించడం, ఎంత బాగుందో!  అలా చక్కగా ముచ్చట్లు చిన్ననాటి విషయాలు మా అమ్మ ,తాత వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మేము అందరం కలిసి మాట్లాడుకుంటూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో!  సాయంత్రం అయ్యాక  గోరింట చెట్టుకు గోరింటాకు తెంపుకొని మా పిన్ని నేను మా అమ్మ అందరము  ఇంటికి వచ్చిన తర్వాత  రాత్రికి గోరింటాకు నూరి అందరము చేతులకు గోరింటాకు పెట్టుకొన్నాము.
తెల్లవారి అందరి చేతులు చూసేసరికి ఎంత ఎర్రగా పండిందో! సెలవులు చాలా సరదాగా గడిచిపోయాయి. 
పల్లెటూర్లలో ఆ ఆనందమే వేరు కదా!

కామెంట్‌లు