గారడివాడు వచ్చాడండిడోలుచప్పుడు చేశాడండి
జనాలంతా మూగారండి
ఎన్నో మాయం చేశాడండి
కొత్తవి ఎన్నో చూపాడండి
గారడి ఎంతో చేశాడండి
మాయలు లేవు అన్నాడండి
మంత్రాలు లేవు అన్నాడండి
ఇంద్రజాలమని అన్నాడండి
మహేంద్రజాలమని అన్నాడండి
ఇవన్నీ మోసాలే అన్నాడండి
ఇదంతా చేతివాటమే అన్నాడండి
జనాలంతా మెచ్చారండి
భలేబాగుందని అన్నారండి
చప్పట్లంతా కొట్టారండి
డబ్బులు సాయం చేశారండి !!
గారడి:--- డా.గౌరవరాజు సతీష్ కుమార్.