1
మట్టిని తాకని
వర్షం లేదు
తీరాన్ని తాకని
అలలూ లేవు
కన్నీటిని తాకని
కళ్ళూ లేవు
పిల్లలను తాకని
చేతులూ లేవు
ఓటమిని తాకని
గెలుపూ లేదు.
2
చెట్టు జీవితం
వేరులో ఉంది
పక్షి జీవితం
రెక్కల్లో ఉంది
భాష జీవితం
నాలుకలో ఉంది
పువ్వు జీవితం
పరిమళంలో ఉంది
మనిషి జీవితం
లక్ష్యసాధనలో ఉంది.
3
ప్రియమైనవారిని
కోల్పోయినా
వస్తువును
కోల్పోయినా
ఆస్తిని
కోల్పోయినా
సుఖాన్ని
కోల్పోయినా
ధనాన్ని
కోల్పోయినా
బంధాన్ని
కోల్పోయినా
వృత్తిని
కోల్పోయినా
మిత్రుడిని
కోల్పోయినా
నువ్వు పేదవాడివేం కాదు...
కానీ
నీ దగ్గరున్న ఆత్మవిశ్వాసాన్ని
కోల్పోనంతవరకూ.
4
అనుకున్నది సాధించలేకపోయినా
అనుకున్నది సాధించేవరకూ చెయ్యడమూ
అదీ ఓ సాధనే
5
చిత్రాన్ని గీస్తే
కాగితం కూడా అమూల్యమే
శిలను చెక్కితే
రాయి కూడా దేవుడే అవుతాడు
పరిపక్వత ఉంటే
గరికను కూడా డబ్బుగా మార్చొచ్చు
లక్ష్యంతో బతికితే
నీ జీవితం కూడా
రేపటి చరిత్ర అవుతుంది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి