ప్రియమైన పాఠకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. 240.బాలసాహిత్య పురస్కార్ 2019 ప్రదానోత్సవం(మూడవ భాగం):: బెలగాం భీమేశ్వరరావు,9989537835.

 సభనంతా కలయజూసి శ్రీ శ్రీనివాసరావు గారు
సభకు నమస్కారం చేసి సభ జరిపే సందర్భం
చెప్పి అందరికీ స్వాగతం పలికారు. వేదిక మీదకు
సాహిత్య అకాడమీ అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్
కంబార్ గారిని ఆహ్వానించి సభకు అధ్యక్షత
వహించవలసిందిగా కోరారు. ముఖ్య అతిథిగా
ప్రముఖ తమిళ కవి, సినీ గేయకవి శ్రీ వైరముత్తు
గారిని ఆహ్వానించారు. తదుపరి సాహిత్య
అకాడమీ ఉపాధ్యక్షులు శ్రీ మాధవ్ కౌశిక్ గారిని
ఆహ్వానించారు.ఈ ముగ్గురు ఆసీనులయ్యాక
కార్యదర్శి గారు అవార్డు గ్రహీత రచయితలను
వేదిక మీదకు రమ్మని కోరారు. రచయితలం 
మాకు కేటాయించిన కుర్చీలలో కూర్చున్నాం.
Telugu మొదటి అక్షరం T 22వ స్థానంలో ఉంది.
నాకు ముందు తమిళ రచయిత, తరువాత ఉర్దూ
రచయిత ఉన్నారు. కార్యదర్శి గారు కూడా
వేదిక మీద ఆసీనులయ్యారు.సభాధ్యక్షుని
తొలి పలుకులయ్యాక ముఖ్య అతిథిగా వచ్చిన
శ్రీ వైరముత్తు గారు తమిళంలో  ఉత్తేజపూర్వకంగా ఉపన్యాసమిచ్చారు.ఆ తరువాత  సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులు ఉపన్యాసమయింది.అప్పుడు అకాడమీ
కార్యదర్శి శ్రీ కె.శ్రీనివాసరావు గారు 
అస్సామీ భాషకు చెందిన రచయిత్రి శ్రీమతి షామిమ్ నస్రిన్ గారిని పిలిచారు.ఆమె సన్మాన
కార్యక్రమం పూర్తయ్యాక వరుసగా శ్రీమతి 
నబనీత్ దేవ్ సేన్ (బెంగాళి), శ్రీ లక్ష్మీనాథ్ బ్రహ్మ
(బోడ),శ్రీ విజయశర్మ(డోగ్రి),శ్రీమతి దేవికా కరియప్ప(ఇంగ్లీష్),శ్రీ కుమార్ పాల్ బాలాబాయ్
దేశాయ్(గుజరాతీ),శ్రీ గోవింద శర్మ(హిందీ),
శ్రీ చంద్ర కాంత్ కరదల్లి(కన్నడ),శ్రీనాజీ మున్వర్ (కాశ్మీరీ),శ్రీమతి రాజశ్రీ బందోడ్కర్ కరపుర్కార్
(కొంకణి),శ్రీ రిషి బషిష్ఠ(మైథిలి),శ్రీ మలయత్
అప్పుణ్ణి(మలయాళం),శ్రీమతి ఆర్.కె.సాణహంబి
ఛాను(మణిపురి),శ్రీ సలీమ్ సరదార్ ముల్లా(మరాఠీ),శ్రీ భవిలాల్ లామిఛానె(నేపాలి),
శ్రీ బీరేంద్ర కుమార్ సామంత రాయ్(ఒడియా),
పవన్ హరచంద్ పురి(పంజాబీ),శ్రీ సంజయ్
కుమార్ చౌబై(సంస్కృతం),శ్రీ లక్ష్మణ్ చంద్ర సరేన్
(సంతాలి),శ్రీమతి వీణాశృంగి(సింధి),శ్రీమతి నాచి
యప్పన్(తమిళం)గారలను పిలిచారు.తమిళం
తరువాత తెలుగు భాషకు చెందిన నన్ను పిలిచారు.సన్మానితుని కుర్చీలో కూర్చున్నాను.(సశేషం)