నా పేరు వేముల సింధుశ్రీ. నేను తెలంగాణ ఆదర్శ పాఠశాల,లింగాల గణపురం లో 9వ.తరగతి చదువుతున్నాను.నేను ఈ వేసవి సెలవులలో మా అమ్మమ్మ గారి ఇంటికి ఖమ్మం వెళ్ళాము. మా అమ్మమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం. నన్ను ఎంతో గారాబంగా చూసుకుంటారు.మేము అక్కడి నుండి విజయవాడ కనకదుర్గ గుడికి వెళ్ళాము. అమ్మవారి కోవెల అక్కడి పరిసరాలు చాలా మనోహరంగా ఉన్నాయి. అమ్మవారిని అద్భుతంగా అలంకరించారు.దర్శనం తర్వాత మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్ళాము. అక్కడ పానకం ప్రత్యేకం. తీయగా ఘాటుగా ఉంటుంది. మొదటిసారి వందే భారత్ రైల్లో ప్రయాణం చేయడం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. నా పుట్టినరోజు మే 16వ. తేదినాడు.ఎప్పుడు వేసవి సెలవులలోనే నా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటాము. స్నేహితులతో జరుపుకోకపోవడం ఒక లోటుగా అనిపిస్తుంది.
నాకు మా అక్కయ్య షటిల్ బ్యాట్ గిఫ్ట్ గా ఇచ్చింది. మా కుటుంబ సభ్యుల మధ్య నా పుట్టినరోజులు వేడుకలు సాధారణంగా జరుపుకున్నాము.మా అమ్మమ్మ చెప్పే కథలు, ముచ్చట్లు నాకెంతో నచ్చుతాయి. వేసవి సెలవులల్లో మామిడికాయ పచ్చడి పెట్టడం చాలా ప్రత్యేకం.వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి గడ్డ పెరుగు వేసుకుని తింటే ఆ రుచి ఎంతో మధురంగా ఉంటుంది.చూస్తుండగానే వేసవి సెలవులు గడిచిపోయాయి. వచ్చే సంవత్సరం వేసవి సెలవులను ప్రయోజనాత్మకంగా గడపడానికి ప్రయత్నం చేస్తాను.ఈ వేసవి సెలవులు నాకు ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలను అందించాయి.

ముందు ముందు మీరు కవయిత్రి అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.. All the best
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి