విరమణ చేసి పట్నంలో ఉధ్యోగం చేస్తున్న కొడుకు దగ్గర కాకుండా తను పుట్టి పెరిగిన జన్మభూమి రుణం తీర్చుకోవాలన్నతపనతో అగ్రహారం గ్రామానికి నివాశం మార్చేరు. భార్య గతించడంతో ఒంటరి పక్షిగా మిగిలారు.పుట్టిన ఊరికి చేరిన పరంధామయ్య మాస్టారు అక్కడిదుస్థితిని చూసి చలించిపోయారు.మారుమూల గ్రామమైనందున సరైన రవాణా సౌకర్యాలురోడ్డు లేక నిరక్షరాస్యత , అపరిశుభ్రత , రక్షిత మంచి నీటి కొరత , వైద్య సదుపాయం లేక ప్రజల్లో అమాయకత్వం మూఢ నమ్మకాలు అనారోగ్యం చూసి ఆయన మనసును కలచివేసాయి.మాలపేట , కాపువీధి , బ్రాహ్మణ వీధి కులాల పేరుతో ఊరువిభజింప బడింది. కొద్దిగా చదువుకున్న వారు బ్రతుకు తెరువుకోసం పట్టణాలకు నివాశం మార్చేరు.కాయకష్టం చేసుకునే రైతులు , కూలీ జనం , రజక కుటుంబాలు , కులవృత్తుల వారు మాత్రమే కనబడతున్నారు.ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులుగెలిచిన తర్వాత వారి ఎడ్రస్సే తెలియదు.గ్రామానికి వచ్చిన వెంటనే మాస్టారు ముందుగా శిధిలావస్థలోఉన్న వారి పూర్వీకుల ఇంటిని మరామ్మత్తులు చేయించి చుట్టు ఉన్న కలుపు మొక్కల్ని తీయించి ఫలవృక్షాలు , పువ్వులమొక్కలు , కూరగాయ మొక్కల్ని ఏర్పాటు చేసారు.స్వయంపాకంతో కడుపు నింపుకుంటున్నారు.పరంధామయ్య గారు ఊరి సర్పంచిని కలిసి గ్రామంలోపరిస్థితులు తెలుసుకున్నారు.గ్రామ పంచాయితీ గదికి సరైనవెంటిలేషన్ లేకుండా కిటికీ తలుపులకు అద్దాలు బదులుగాఅట్టలు ఉంచి బూజులు పట్టి ఉంది.మాస్టారు ప్రథమంగా ఊళ్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలమీద దృష్టి సారించారు.రామాలయం పక్కనే ఒకే గదిలో ఐదుతరగతులు నడుస్తున్నాయి. పైన పెంకులు పగిలి సూర్యకాంతిగదినిండా ప్రసరిస్తోంది. గది గోడలు పెచ్చులూడి రంగు వెలిసిఉన్నాయి.ఒక కర్ర కుర్చీ, ఎదురుగా టేబుల్ మీద అట్ట చిరిగిన రిజిస్టర్ఉంది. దాంట్లో కొంతమంది బినామీ విధ్యార్థుల పేర్లు రాసి ఉన్నాయి.ఒకే ఉపాధ్యాయుడు ఉన్నాడు. వీలున్నప్పుడుపాఠశాలకు వచ్చి రిజిస్టర్లో సంతకం చేసి వెళతాడు.సర్పంచినిమంచి చేసుకుని విధ్యార్థులు రాకపోయినా హాజరు మార్కువేస్తాడు.ఇదంతా గమనించిన పరంధామయ్య మాస్టారు గ్రామ సర్పంచి , విధ్యార్థుల కుటుంబ సబ్యుల్ని సంప్రదించి పిల్లలురోజూ పాఠశాలకు హాజరయేలా చేసారు.తన పెన్షన్ డబ్బుతో పాఠశాల భవనానికి మరామత్తులుకావించి సున్నం వేయించి జండాదిమ్మకు రంగులద్దించిపరసరాల్లో పువ్వుల మొక్కలు నాటించి చుట్టూ దడి ఏర్పాటుచేసారు.చిన్న బొమ్మల చార్టులు , దేశ నాయకుల ఫోటోలు గోడలకుతగిలించారు.పాఠశాల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చూసారు. పిల్లలకు కావల్సిన పుస్తకాలు పెన్సిళ్లు తెప్పించి ఇచ్చారు.వారు రోజూ తప్పకుండా స్కూలుకి రావడానికి మధ్యలో బిస్కెట్లు వంటి చిరుతిళ్లు ఏర్పాటు చేసారు.ముఖ్యంగా విధ్యార్థుల శరీర శుభ్రత, బట్టల శుభ్రతపైధ్యాస పట్టేరు.మాస్టారి కృషి వల్ల రోజురోజుకూ పిల్లల సంఖ్య పెరుగుతూవచ్చింది. ప్రస్తుతమున్న టీచర్ క్రమం తప్పకుండా పాఠశాలకుహాజరౌతున్నాడు.ఇద్దరూ కలిసి విధ్యార్థుల్ని విభజించి చదువుమొదలెట్టారు.రాత్రిళ్లు తన ఇంటి వద్ద గ్రామసర్పంచి , యువకుల్ని , వయోవృద్ధుల్నీ చేరదీసి వయోజన విధ్య ప్రారంభించేరు.నాటుసారా , మధ్యపానం , పొగతాగడం వల్ల కలిగే అనర్థాలను ఆర్థిక నష్టాలను వివరించి బొమ్మల చార్టుల ద్వారాఅవగాహన కలిగించేరు.హెల్త్ విజిటర్ చేత రోజూ గ్రామంలో విజిట్ చేయించి స్త్రీల ,పిల్లల శుభ్రత , శిసువుల పరిరక్షణ , ఇంటి పరిసరాల శుభ్రత,ఆరోగ్యం విషయాలపై అవగాహన కలిగేలా చేసారు.మండల కార్యాలయాని కెళ్లి తహశీల్దారు , పశువైధ్యశాల ,ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అధికారులను సంప్రదించి ఊరికికావల్సిన మౌలిక సదుపాయాలు కల్పించారు.రాష్ట్ర ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ ద్వారా సమకూరేరేషను సరుకులు సక్రమంగా పంపిణీ అయేలా ఏర్పాటు చేసారు.ఊరి రచ్చబండను రోడ్డుకు దగ్గరగా సిమ్మెంటు దిమ్మను కట్టిఅక్కడ ఊరిలో జరిగే చిన్న తగాదాలు ఇతర సమస్యలనుపరిష్కరించు కుంటున్నారు.మధ్యపానం , ధూమపానం, గుట్కా, పేకాట వంటి దుర్వ్యసనాల వల్ల జరిగే అనర్దాల ప్రభావం వారికి అర్థమైంది.ఊళ్లోని రైతుల నుంచి పాలను పాలసరఫరా కేంద్రాల్లో సేకరించివారికి సరైన కిట్టుబాటు ధర లభిస్తోంది.విధ్యార్థుల మధ్యాహ్న భోజన పథకంలో , అంగన్ బాలవాడికేంద్రాల్లో రేషను సరుకులు పిల్లలకు సమకూరుతున్నాయి.పంచాయతీ కార్యాలయం ద్వారా తెలుగు వార్తల దినపత్రికవస్తోంది.చదువు నేర్చిన యువకులు ప్రాంతీయ దేశ సమాచారంతెలుసుకుంటున్నారు. రాత్రిళ్లు మధ్యం తాగి జరిగే కోట్లాటలకుతెరపడింది. మూఢ నమ్మకాలకు స్వస్తి పలికి శాస్త్రీయ విధానాన్నిఅమలు చేస్తున్నారు.పల్లెలే దేశ ప్రగతికి మూలాలుగా ఊరిని తీర్చి దిద్దారు.చెరువు కింద బోర్లు వేయించి తిండిగింజలు , కూరగాయలు , పళ్లూ, వాణిజ్య పంటలు పండించి పట్టణానికితీసుకెళ్లి అమ్మి ఆర్థికంగా బలపడ్డారు.రోడ్డు మార్గం సరిగ్గాఉన్నందున బస్సు సౌకర్యం కలిగి సరుకు రవాణాకు అనుకూలమైంది.ఊళ్లోని పశుసంపద ఆవులు గేదెలు మేకలు గొర్రెలు ఎడ్లువగైర జంతువులకు సిబ్బంది ద్వారా పశువైధ్యం జరిగి ఆరోగ్యంగా ఉంటున్నాయి.యువతకు బ్యాంకుల ద్వారా డబ్బు లోన్లుగా అంది కోళ్లఫారాలు డైరీలు నడుపుకుంటున్నారు.సహకా సంఘాలు ఏర్పడి ఆర్థికావసరాలు తీర్చుకుంటున్నారు.ఊరిలో మురుగు కాల్వలు ఏర్పాటు చేసి ఈగలు దోమలవ్యాప్తిని అరికట్టారు.రజకులు పట్నం నుంచి తెచ్చిన మురికి బట్టలు ఊరి మధ్యలో చేద బావి నుంచి నీళ్లుతోడి గోలాలలో నింపి రాతిబండ మీద ఉతికిన మురుగు నీరు గోతిలో చేరి దోమలువిజృంభిస్తున్నాయి. సర్పంచి , ఊరి ప్రజలతో సంప్రదించి గ్రామానికి దూరంగా కొండ కాలువ దగ్గర చాకిరేవుకి బందోబస్తుచేసారు.కమ్మరి కుమ్మరి వడ్రంగి క్షురకుల చేతి వృత్తుల వారికిజీవనోపాది కల్పించారు. గ్రామంలో ప్రతి పేటకు రహదారులుఏర్పడి రాకపోకలు మెరుగు పడ్డాయి. విధ్యుత్ దీపాల కాంతిలోజనం నిర్భయంగా సంచరించ గలుగుతున్నారు.రక్షిత నీటి ట్యాంకరు కట్టించి బ్లీచింగుతో పరిశుభ్రమైనమంచి నీరు కొళాయిల ద్వారా లబ్యమౌతోంది.సహకార సంఘాల ద్వారా డబ్బు పొదుపు జరిగి అత్యవసర సమయాల్లోఆర్థికావసరాలు తీరుతున్నాయి.ప్రభుత్వ గృహ పథకంలోగుడి సెలు పాక ఇళ్ల స్థానంలో స్లేబ్ ఇళ్లు వచ్చాయి.ప్రజల జీవనశైలి మారింది.కొండవాగు దగ్గర చెక్ డ్యాములు నిర్మించి వర్షాకాలంలోవరద నీరు ఊరి చెరువుకి చేర్చి చేపల పంపకం ద్వారాపంచాయతీకి రాబడి పెంచారు.ఊరి రామాలయానికి గ్రామదేవత గుడికి అలంకరణలు చేసిపండగలప్పుడు సంబరాలు జరుపుకుంటున్నారు.పంచాయితీ కార్యాలయం రూపురేఖలు మారిపోయాయి.పరంధామయ్య మాస్టారి కృషి వల్ల మారుమూల వెనుకబడిన పల్లె గ్రామం అగ్రహారం జిల్లాలో ఉత్తమ పంచాయతీగాఎన్నిక జరిగి ప్రశంసా పత్రం , నగదు బహుమతి జిల్లా కలెక్టరుగారి చేతుల మీదుగా అందుకున్నారు.పల్లెలే దేశ ప్రగతికి మూల స్తంభాలని నిరూపితమైంది.పరంధామయ్య మాస్టారు తను పుట్టిన జన్మభూమికిసేవ చేసి ఊరి ప్రజలలో చైతన్యం కల్పించి అందరి బంధువయారు.* * *
అందరి బంధువు :-- కందర్ప మూర్తి , హైదరాబాద్.మొబైల్ : 8374540331.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి