సేవాఫలం: -డి. సమీరభాను.8వతరగతి.కొత్తపేట.

 అది ఒక జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల.అక్కడ నితిన్
చదువుతున్నాడు.అతనుచాలామంచివాఢు.
సహకార గుణంకలవాడు. సేవాభావం కలవాడు .
కష్టపడి చదివేవాడు.
ఒకరోజు ఆ పాఠశాలముందు ఒక వృద్దుడు నీరసంగా పడిఉండటం చూశాడు.విద్యార్థులు ఎవరూ
పట్టించుకోలేదు.నితిన్ వృద్దుడి దగ్గరకెళ్ళి
పలకరించాడుఅతను అనాథ అని ఆకలితో ఉన్నాడని తెలుసుకున్నాడు.తన బ్యాగులో ఉన్న
రెెండు అరటిపండ్లు, ఒక జామపండు తెచ్చి ఇచ్చాడు.తిన్నాక నీళ్ళు ఇచ్చాడు.తర్వాత
ఆ వృద్దుడు నితిన్  ను సేవాగుణానికి
సంబంధించిన కొన్ని ప్రశ్నలడిగాడు.
ఆకలితో ఉన్నవారికి వృద్దులకు  వికలాంగులకు చేతనైన సాయం చేయాలని
మానవత్వం కలిగి ఉండాలని నితిన్ చెప్పిన
సమాధానాలు విని అభినందించాడు.
తర్వాత మరునాడువృద్దుడు పాఠశాలలోకి వచ్చా డు.తెల్లటికొత్తదుస్తుల్లోమెరిసిపోతున్నాడు
ప్రధానోపాధ్యాయుడి తో మాట్లాడి. నితిన్
తల్లిదండ్రులను పిలిపించమన్నాడు.
ప్రధానోపాధ్యాయుడు నితిన్ ను ఇంటికెళ్ళి అమ్మ.నాన్నలను పిల్చుకురమ్మ
న్నాడు.వాళ్ళు వచ్చారు
వృద్దుడు వారికి జరిగిన విషయం చెప్పి "నేనుకోటీశ్వరుడిని. నాకు పిల్లలులేరు.నాడబ్బును
సేవాగుణం కల్గిన పేదపిల్లల కోసం ఉపయోగించాలనుకుంటున్నాను.అలాంటి
వారిని గుర్తించటం కోసమే తిరుగుతూ       ప రీక్షించి దయాగుణం గలవారి చదువుకు సాయం చేస్తూ వస్తున్నాను.మీఅబ్బాయి పేరుతో బ్యాంక్
లో ఐదులక్షలు జమచేస్తాను.ఆ డబ్బు చదువుకోసం ఉపయోగించండి.
ఇలాంటి పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తే, సమాజానికి సేవలందిస్తారు"అనిచెప్పి అభినందించాడు.
ఆయన నితిన్ పేరుతో డబ్బు బ్యాంక్ లో వేశాడు.నితీన్ ఉన్నత చదువులు చదివి,
ఉన్నతపదవిని పొంది, పేదలకు, అనాధలకు సేవలందించాడు.
(డి.కె.చదువులబాబు సంపాదకత్వంలో విద్యార్థులు వ్రాసిన కొత్తపేటకలాలు కథాసంకలనంలోని కథ)