భారత ప్రజలకు దాస్యవిముక్తితెల్లవాళ్ళను తరిమిన కీర్తి
ఘనమైన పాలనకు స్వతంత్రశక్తి
వచ్చిన ఈడే రిపబ్లిక్ డే...
జనపాలనకు శ్రీకారం చుట్టి
రాజ్యాంగాన్ని అమలున పెట్టి
ఆనందాల మూటలు కట్టి
తెచ్చిన ఈడే రిపబ్లిక్ డే...
ఘనవిజయం ఇది గణతంత్రం
జనుల గుండెకు స్వేచ్ఛదినం
పాఠశాలలకు పర్వదినం
అందించిన ఈడే రిపబ్లిక్ డే...
జాతీయమూర్తుల త్యాగఫలం
మహా నేతలను స్మరించుదాం
ప్రగతి పథంలో పయనిద్దాం
గణతంత్ర వేడుకలో మునకేద్దాం
రిపబ్లిక్ డే (బాలగేయం):---మమత ఐల--హైదరాబాద్--9247593432
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి