ప్రశ్నించాలి..:-రాజేష్ మిట్టపెల్లి..... 9441672957


 నాటి సమాజంలో పరిపాలన వ్యవస్థ ఎంత అధ్వానంగా, అవినీతిగా పరిపాలన సాగుతుందో అందరికీ తెలుసు. మనిషి జీవనం సాగించడానికి   ప్రకృతి పరంగా అన్ని సదుపాయాలను ఉచితంగా  సమకూర్చుకున్నాడు మనిషి అభివృద్ధితో పాటు,  స్వార్థ పరుడిగా వృద్ధి లోకి వస్తున్నాడు. చరిత్ర చూసుకుంటే... కుల, మత, లింగ, బేద వ్యత్యాసాల తో యుద్ధాలు చేసి, ప్రాణ త్యాగాలు చేసిన మహానుభావులు ఎందరో నేటి నుంచి ఈనాటి వరకు హత్యలు, కుట్రలు, కుతంత్రాలు, మానభంగాలు, మూఢనమ్మకాలు, సతీసహగమనం ఇలా ఎన్నో ఘోరమైన పరిణామాలను ఎదుర్కొంటూ మనిషి మనుగడ సాగుతోంది.  ఈ సమస్యల నుండి ఒక మహానుభావుడు  అందరూ సమానంగా జీవించాలని, అన్ని సౌకర్యాలను అందరికీ సమానంగా ఉండాలని  భారత రాజ్యాంగాన్ని రచించారు. లిఖిత రూపంలో ఉన్న మన రాజ్యాంగాన్ని, ప్రజల పరిపాలన కనుగుణంగా సవరణ చేసుకొనుటకు అవకాశం కల్పించారు. దీనిని ఆసరాగా చేసుకుని రాజకీయ వ్యవస్థలు చెయ్యని అవినీతి లేదు,  మనం చిన్నప్పుడు బడిలో చదువుతున్నప్పుడు " కులం లేదు మతం  లేదు అందరూ సమానమే, అని బోధిస్తారు." కానీ ఉద్యోగ విషయంలో కుల వ్యవస్థను తీసుకొస్తారు. ఇది కేవలం అధికారంలో ఉండాలన్న దురుబుద్దితో చేస్తున్న దృశ్యంగా చెప్పవచ్చు. బడిలో పిల్లలకు బోధించేది ఒకటి, వారి జీవితాలలో జరిగేది ఇంకొకటి.  సమాజ పరిపాలనలో అవినీతి తాండవిస్తుంది. ఈ పరిపాలనా యంత్రాంగం ప్రతి మనిషిని అవినీతి పరంగా తయారు చేస్తుంది, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టరేట్, ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రులు, మొదలుకొని ప్రతి ఒక్కరికి అవినీతి వంశపారపర్యంగా వస్తుంది.  అందుకే  ఈ వ్యవస్థను మార్చడానికి, నిలదీసి అడగడానికి, ప్రశ్నించడానికి ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం ఓటు హక్కును కల్పించింది. ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు సమాజంలో జరుగుతున్న అవినీతిని అరికట్టవచ్చు.  ఎక్కడైనా అన్యాయం జరిగినా, అవినీతికి పాల్పడిన ప్రశ్నించే హక్కు ప్రతి ఓటరుకు ఉంటుంది. మనను పరిపాలించడానికి ఏర్పరచుకున్న వ్యవస్థను, మనకు సేవ చేసే విధంగా తయారు చేయాలి.  ప్రతి విద్యార్థి చిన్నతనం నుండే భారత రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించాలి, ప్రశ్నించే తత్వం నేర్పించాలి అప్పుడే ఈ సమాజాన్ని సరైన దారిలో పెట్టవచ్చు.