విసపు మాటలు పలికి ప్రేమనువిరుగ గొట్టుట తప్పు కదమరి?
ప్రేమ సుమములు పూసి నప్పుడె
వెలుగు బంధము భరత పుత్రుడ! 20
నీతి చాటెడు రమ్య పదములు
భీతి వీడుచు వ్రాయ వేమిర
నీతి యే మన జాతి ధనమని
రీతి నుడువర భరత పుత్రుడ! 21
భరత పుత్రుడా!(గేయ సూక్తులు):-డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల 9948089819