గేయసూక్తులు : --డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల9948089819


 ప్రేమ గుండెల పొంగి పొరలిన

విరియు స్నేహపు రమ్య వాటిక

ప్రేమలే కద మనిషి బాధను

విరుగ గొట్టును భరత పుత్రుడ!  24


మహాకవి గురజాడ జాడల

మనుషు లంతా సాగి నప్పుడె

మంచి వెన్నెల విరిసి కురియును

మనసు తోటల భరత పుత్రుడ!  25