గణతంత్రం దినోత్సవం
కారాదు ఒక రోజు పర్వం
నిండి ఉండాలి గుండెల్లో గర్వం
దేశమే కావాలి మనకు సర్వం
ప్రాణము కన్న మిన్నగా ప్రేమించాలి దేశాన్ని
ఆస్తిపాస్తుల కన్న ఎక్కువగా
చూసుకోవాలి దేశాన్ని
ఎందరో దేశ భక్తుల త్యాగఫలితమీ దేశం
మరెందరో మహానుభావుల
నిస్వార్ధ సేవకు సాక్ష్యమీ దేశం
ఇంకెందరో వీరుల యోధుల
రక్తతర్పణతార్కాణ మీ దేశం
అటువంటి దేశానికి పట్టినాయి
చెదలు కమ్మినాయి ముళ్లపొదలు
దారి పొడవునా గాజుపెంకులు
కాచుకొనివున్నాయి పందికొక్కులు
దోచుకోన చూస్తున్నారు నాయకులు ప్రజాసొమ్మును
బినామీ పేర్లతో భాగ్యవంతులవుతున్నారు
తరతరాలుగా కూర్చోని తిన్న
తరగని ఆస్థులని వెనుకేసుకుంటున్నారు
పేదలు పేదలై పోతున్నారు
నిరుపేదలుగా మారుతున్నారు
సర్ప0చులు లక్షలు గడిస్తున్నారు
అక్కడినుంచి అంచలంచలుగా
పెరుగుతున్నారు
నీతి నిజాయితికి పాతరేశారు
న్యాయం ధర్మాన్ని పూడ్చేశారు
విరోధులు రాకుండా వీరులు
కాపలా కాస్తుంటే
ప్రాణాలు ఫణంగా పెట్టి పహారా
కాస్తుంటే
డేగ కళ్ళతో దేశాన్ని కాపాడుతుంటే
ఒళ్ళో0చకుండ కోట్లు గడిస్తున్నారు
కష్టపడకుండ వందల కోట్లు
వెనుకేసుకుంటున్నారు
ఈ పద్ధతి మారాలి
సమ సమాజ నిర్మాణం జరగాలి హెచ్చు తగ్గుల్లేని
సంఘం కుదురుకోవాలి
అప్పుడే గణతంత్రానికి అర్థం
జన సమానత్వానికి మార్గం
కారాదు ఒక రోజు పర్వం
నిండి ఉండాలి గుండెల్లో గర్వం
దేశమే కావాలి మనకు సర్వం
ప్రాణము కన్న మిన్నగా ప్రేమించాలి దేశాన్ని
ఆస్తిపాస్తుల కన్న ఎక్కువగా
చూసుకోవాలి దేశాన్ని
ఎందరో దేశ భక్తుల త్యాగఫలితమీ దేశం
మరెందరో మహానుభావుల
నిస్వార్ధ సేవకు సాక్ష్యమీ దేశం
ఇంకెందరో వీరుల యోధుల
రక్తతర్పణతార్కాణ మీ దేశం
అటువంటి దేశానికి పట్టినాయి
చెదలు కమ్మినాయి ముళ్లపొదలు
దారి పొడవునా గాజుపెంకులు
కాచుకొనివున్నాయి పందికొక్కులు
దోచుకోన చూస్తున్నారు నాయకులు ప్రజాసొమ్మును
బినామీ పేర్లతో భాగ్యవంతులవుతున్నారు
తరతరాలుగా కూర్చోని తిన్న
తరగని ఆస్థులని వెనుకేసుకుంటున్నారు
పేదలు పేదలై పోతున్నారు
నిరుపేదలుగా మారుతున్నారు
సర్ప0చులు లక్షలు గడిస్తున్నారు
అక్కడినుంచి అంచలంచలుగా
పెరుగుతున్నారు
నీతి నిజాయితికి పాతరేశారు
న్యాయం ధర్మాన్ని పూడ్చేశారు
విరోధులు రాకుండా వీరులు
కాపలా కాస్తుంటే
ప్రాణాలు ఫణంగా పెట్టి పహారా
కాస్తుంటే
డేగ కళ్ళతో దేశాన్ని కాపాడుతుంటే
ఒళ్ళో0చకుండ కోట్లు గడిస్తున్నారు
కష్టపడకుండ వందల కోట్లు
వెనుకేసుకుంటున్నారు
ఈ పద్ధతి మారాలి
సమ సమాజ నిర్మాణం జరగాలి హెచ్చు తగ్గుల్లేని
సంఘం కుదురుకోవాలి
అప్పుడే గణతంత్రానికి అర్థం
జన సమానత్వానికి మార్గం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి