ఆకుకూరలూ ...జిందాబాద్ .....:------డా.కె .ఎల్వీ --హన్మకొండ


 మిద్దెతోట 

ఫలితాలు 

ముద్దు ముద్దు గా 

వున్నాయ్ ....

ఆకుకూరలకే 

ప్రాధాన్యం ,

అమ్మ .....

ఆలోచనా విధానం !


మిద్దె మాత్రం మాది 

మట్టిఅవసరాలు 

నర్సరీల నుండి 

మిగతా సామాగ్రి 

అమెజాన్ వారి 

అద్భుత సరఫరా ...!


పాలకూర -

మెంతికూర ,

కొత్తిమీర ...

కరివేపాకు 

గోంగూర ఆకు ....

కాదేదీ ..అనర్హం 

మిద్దెతోట సాగుకు 

నిజం ..నిజం ....!


అమ్మ సేద్యానికి ..

అమ్మ ..అభిరుచికి ,

సలాం ..సలాం ...!!


     --