పిల్లల పలుకులు
తేనెల చినుకులు
పిల్లల చేష్టలు
మరిపించు కష్టాలు
పిల్లల నవ్వులు
విరబూసిన పువ్వులు
పిల్లల మనసులు
వెండి వెన్నెలలు
పిల్లల ఏడుపులు
తొలగించు కల్మషాలు
పిల్లల రూపాలు
దేవుని ప్రతిరూపాలు
పిల్లలు
నవ్విన అందమే
ఏడ్చిన అందమే
నడచిన అందమే
పలికిన అందమే
ప్రతి ఇంటికి పరిపూర్ణానందమే
ప్రతి తల్లికి మధురానందమే!!
మధురానందమే:- కవిత వేంకటేశ్వర్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి