'' ఆ'' ఇద్దరు :- టి. వేదాంత సూరి


 ఒకవైపు వేసవి మండి పోతుంది. మరో వైపు ఆద్యకు , ఆరియాకు ఇంట్లో బొర్ వస్తుంది. మూడు రోజులుగా కౌంట్ డౌన్ పార్క్ కు తీసుకు వెళతాం అని చెబుతున్నా ఏదో కారణాల వలన వాయిదా వేసుకో వలసి వస్తుంది. 
ఇక తప్పకుండా ఈ రోజు తీసుకు వెళ్లాలని అనుకున్నాం ఆద్య, అత్త , మామ కూడా వెళదాం అన్నారు కార్ లో బయలు దేరాం దగ్గరే , నడిచి పొతే అరగంటలో చేరుకుంటాం, కార్ లో కాబట్టి నాలుగు నిమిషాలలో చేరుకున్నాం, 
ఇది పిల్లలు ఆదుకునే స్థలం , ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. ప్రతి కమ్యూనిటీ కి ఇలాంటిది తప్పకుండా ఉంటుంది. ఎంతసేపైనా ఆడుకోవచ్చు. 
ఆరియా ఉయ్యాలలో బాగా ఎంజాయ్ చేసింది, ఆద్య జారుడుబండ తో ఆడింది. తరువాత ఆద్య ఉయ్యాల ఎక్కితే ఆరియా గొడవ, కాసేపు తరువాత ఆరియాకు ఇచ్చింది. 
ఇక మొదట ఆరియా  జారుడుబండకు  భయ పడినా తరువాత బాగానే ఎంజాయ్ చేసింది. 
ఆటల  ప్రదేశానికి ఎక్కడికి వెళ్లినా యెంత సేపైనా మళ్ళీ ఇంటికి రావాలంటే పిల్లలు మారాం చేస్తారు.  సుమారు గంటన్నర సేపు అక్కడ వున్నా వారికి తనివి తీరలేదు. మాకు కూడా సమయం  ఐదు నిమిషాల్లా గడిచి పోయింది. 
 ఆరుగంటలకు వెళితే ఏడున్నర వరకు అక్కడే గడిపాము, వేసవి కదా. ఎండ కూడ వుంది. కాక పొతే చల్ల గాలి వలన వేడి తీవ్రత ఏర్పడ లేదు. 
( మరిన్ని ముచ్చట్లు రేపు)