తోడు(పాట)--డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 పల్లవి:
తోడూ నీవే జాడా నేవే
ఓ చరవాణీ!
కూడూ గూడూ లేకున్నా కావాలి నీవే!
చరణం:1
నిత్యం నీ దర్శనం లేక తెల్లవారదాయె
నీ జాడ కానరాకపోతే గుబులాయె
నీవేమో నా తోడు శౌచాలయాన
నీవేమో సరిజోడు హృదయాన
తోడూ నీవే జాడా నీవే
ఓ చరవాణీ!
కూడూ గూడూ లేకున్నా 
కావాలి నీవే!
చరణం:2
ఎందరిలో ఉన్నా నీ పైనే నా ధ్యాస
ఎక్కడికెళ్ళినా నీతోటే నా యాస
ఎప్పుడైనా,ఎక్కడైనా వదిలానా నిన్ను
చప్పుడైతే చాలు తప్పక వచ్చానా? లేదా?
నిన్నెంత అందంగా తీర్చిదిద్దాను నేను
నీకోసం వెతికివెతికి వేడాను నేను
నువ్వెంత ఖరీదైనా వదిలానా నేను
నా కోసం ఒదిగి ఒదిగి పోయావు నీవు
తోడూ నీవే జాడా నీవే 
ఓ చరవాణీ!
కూడూ గూడూ లేకున్నా 
కావాలి నీవే!
చరణం:3
రోడ్డుపైన నిన్ను చూస్తూనే వెళ్తున్నాను
బెడ్డుపైన నీవు కన్పిస్తూనే ఉంటావు
ఫుడ్డు తినేటప్పుడు వదిలానా నిన్ను
రోజుకెన్ని హంగులో నీ మోజులో
రీఛార్జులతో నిన్ను పెంచుకున్నాను
స్క్రీన్ గార్డులతో‌ నిన్ను చల్లంగ చూసుకున్నాను
చిన్నగీత పడకుండా పదిలపరిచాను
నిన్నెప్పుడూ నాతోనే ఉంచుకున్నాను
తోడూ నీవే జాడా నీవే
ఓ చరవాణీ!
కూడూ గూడూ లేకున్నా 
కావాలి నీవే!