గునగున నడిచే తాబేలుడిప్ప ఉందిలే దాగే వీలు !
నేలా నీటిలో ఉంటుంది
కాయాగసురో తింటుంది!
విష్ణువు అంశ వీరండీ
ఇసుకలో గుడ్లు పెడుతుంది
రవి కిరాణాలకు పొదగబడి
పిల్లలు బయటకు వస్తాయండి!
గద్దలు నక్కలు మనుషులూ
వీటికి పెద్ద శత్రువులూ
అలికిడి వింటే శరీరమూ
డిప్పలో లాగి జర పదిలమూ!
కుందేలు పరుగు పందెంలో
తాబేలమ్మకు గెలుపెట్లో?
మితిమీరిన ఆత్మ విశ్వాసం
కుందేలమ్మ ఓటమి కారణం!
పెరటి బావిలో తాబేలు
పిల్లలు చాలా నేస్తాలు !
మధ్యాహ్నంలో పైకొచ్చి
ఈదుతూ ఉంటే చూస్తారు!
నక్షత్ర తాబేళ్లు విలువైనవి
నరుల చేతిలో చిక్కునవి
లక్షల చేయు వ్యాపారం
తాబేలు రవాణా అతినేరం!
తాబేలు -బాల గేయం : --ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి