నమ్మ లేక పోతున్నది:- --యాదయ్య.జి

 నమ్మ లేక పోతున్నది
నక్క ఒక్కటీ...
చూడ లేక పోతున్నది 
చుక్క ఒక్కటీ...
కులక లేక పోతున్నది
కుక్క ఒక్కటీ..
కునక లేక పోతున్నది
కునుకు ఒక్కటీ...
ఎగర లేక పోతున్నది 
ఎలుక ఒక్కటీ...
తిరగ లేక పోతున్నది 
తిరుగు ఒక్కటీ ...
కదల లేక పోతున్నది 
కప్ప ఒక్కటీ ...
చెప్ప లేక పోతున్నది 
గొప్ప ఒక్కటీ ...
మెయ్య లేక పోతున్నది
మేక ఒక్కటీ ...
వెయ్య లేక పోతున్నది 
అడుగు ఒక్కటీ ...
అడగ లేక పోతున్నది
ఆవు ఒక్కటీ ...
వేయ లేక పోతున్నది పేడఒక్కటీ ...
ఏడ్వ లేక పోతున్నది
ఏనుగొక్కటీ ...
తూడ్వ లేక పోతున్నది
ఏడుపొక్కటీ ...
పిలవ లేక పోతున్నది
పిల్లి ఒక్కటీ ...
చెయ్య లేక పోతున్నది
లొల్లి ఒక్కటీ ...
పొడవ లేక పోతున్నది
పోతు ఒక్కటీ ..
మడవ లేక పోతున్నది
మడిమ ఒక్కటిc...
పలక లేక పోతున్నది
చిలుక ఒక్కటీ...
తెరవ లేక పోతున్నది
తలుపు ఒక్కటీ ...
కుయ్య లేక పోతున్నది
పుంజు ఒక్కటీ...
తియ్య లేక పోతున్నది
కూత ఒక్కటీ..
బలవ లేక పోతున్నది
బల్లి ఒక్కటీ...
తెలప లేక పోతున్నది
తెలివి ఒక్కటీ..
     ..