చంద్రకాంత చెట్టు, పువ్వులు- ఔషధ గుణాలు...:- పి .కమలాకర్ రావు

 చంద్రకాంత చెట్టు పువ్వులు వేరు  భాగం అన్ని మందుగా పనికి వస్తాయి. తెలంగాణ ప్రాంతంలో దీన్ని రుద్రాక్ష గా పిలుస్తారు. దీని పూలు అన్ని రంగులలో ఉంటాయి. ఆరుబయట ఈ చెట్లు వాటంతట అవే పెరుగుతాయి. దీని పూలు సాయంత్రం వేళలో పూస్తాయి. అందుకని 4 "O" Clock flower గా  కూడ  దీనికి పేరుంది.
ఇది మన శరీరంలో గడ్డలు రానివ్వదు. సూక్ష్మ క్రిములను పెరగనివ్వదు. దీని ఆకులను శుభ్రంగా కడిగి కాషాయం చేసి త్రాగితే కడుపులోని పుళ్ళు  తగ్గి పోతాయి. దీని ఆకులను ఆముదం లో వేయించి  గడ్డలపై కట్టు కడితే  గడ్డ పగిలి చీము బయటికి వచ్చి సలపడం తగ్గి గడ్డ మానిపోతుంది. రుద్రాక్ష   వేరు భాగం దుంప ను కలిగి ఉంటుంది. దుంపపై  బెరాడు తీసివేసి ముక్కలు చేసి గుమ్మడి గింజలు లేక పుచ్చగింజలు లేక కీరాదోసెగింజలు నల్లగొట్టి నీరు పోసి మరిగించి కొద్దిగా బెల్లం వేసి పాలు కూడ కలిపి  గోరువెచ్చగా  త్రాగితే  మలభద్ధకం పూర్తిగా  తగ్గి పోతుంది. దీనితో  స్త్రీలకు తెల్లబట్ట సమస్య నివారణ అవుతుంది. పురుషులకు కూడ వీర్య కణాల సమస్యలు తగ్గి పోతాయి.