మాఇల్లు:- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 మేము పుట్టినా మాఇల్లు

మేము పెరిగినా మాఇల్లు

మేము పాకినా మాఇల్లు

మేము నడిచినా మాఇల్లు

మేము ఆడినా మాఇల్లు

మేము పాడినా మాఇల్లు

తల్లిప్రేమ రుచిచూపిన ఇల్లు

తండ్రిప్రేమ రుచిచూపిన ఇల్లు

చెల్లీ జతగా ఆడిన ఇల్లు

అన్నా జతగా ఆడిన ఇల్లు

దైవభక్తిని నేర్పిన ఇల్లు

దేశభక్తిని నేర్పిన ఇల్లు

వినయవిధేయతలు నేర్పిన ఇల్లు

గౌరవమర్యాదలు నేర్పిన ఇల్లు

ఎన్నోవిషయాలు నేర్పిన ఇల్లు

కలిసీమెలిసీ ఉంటాము

అందరి మేలు కోరుతాము !!