జయహో భారత్: నమిలకొండ జయంత్ శర్మ

 పౌరుషాల రవిచంద్రమై
పుడమి పులకరించేలా
భరత జాతి ఖ్యాతి నీతి
నలుదిశల చాటిన
మహనీయులెందరో!
అడుగులేయు వారి ఆదర్శంలో
అవిశ్రాంతమై పోరు వారిధ్యేయంలో
రాముడవై కృష్ణుడవై అరాచకాల
కాలరాసేయు కదనరంగ ధీరుడవై.
నేతాజీలవోలే నివురు గప్పునిప్పువై
భరత ఖ్యాతి విశ్వాన నిలబెట్టవో!
అవినీతి అంతమవగ పరశురాముల్లై
అవనిజనులు మెచ్చ అవతరించరారో!
శత్రుమూకల ఛండాడ వీరభద్రరుద్రులై
అమేయ పౌరుషాగ్నులై ప్రజ్వరిల్లరో!
నీ దేశం ప్రేమించు విశ్వప్రేమ చాటు
నింగివరకు విజ్ఞానులై పొంగ విజేయులైరారో!
నీ దేశ ఊపిరే నీజయ కేతనమేరా
ఈజెండాకే వందనమే చేయగరారా!
పాంచ జన్యమే పూరించు సంబరాలతో
ప్రపంచమే గర్వించ ప్రతిరంగాన నిలువు.
జయహో భారత్ జయ జయహో భారత్
జయ జయ జయహో భారత్!
కామెంట్‌లు