గాజులు ....: ----డా.కె .ఎల్ .వి.ప్రసాద్ ,హన్మకొండ -


 గాజులు ..గాజులు ..గాజులు 

అందమైన గాజులు 

రంగు ..రంగుల గాజులు 

ఆకర్షణీయమయిన గాజులు !


ఆడ పిల్లలను అమితంగా ,

ఆకట్టుకునే గాజులు 

బుజ్జి ..బుజ్జి ..చేతులకు 

భలే గఅమరిపోయే గాజులు 

అందంగా ఉన్న చేతులకు 

మరింత అందం -

సమకూర్చే గాజులు !


రకరకాల గాజులు 

రోజువారీ గాజులు

మోజుపడే ..

మ్యాచింగ్ గాజులు ,

మనసును 

ఆకట్టుకునే గాజులు 

మంచి ముత్యాల గాజులు !


అమ్మమ్మ కొన్నదీ...

బంగారు గాజులు 

అమ్మేమో కొన్నదీ....

అన్ని రకాల గాజులు ..!


బయటకు వెళితేనే

బంగారు గాజులు ...

ఇంట్లొనెమో....

మామూలు గాజులు ..

వీటితోనే ప్రతిరోజూ 

చేతులకు అలంకారం !


బంగారు గాజులకు 

బాంకు లాకర్లే దిక్కు 

బయటపడే మార్గం కోసం 

ఎదురు చూస్తుంటాయి 

నిత్యం ......!!


గాజులు ..గాజులు ..గాజులు 

అందమైన గాజులు ...

రకరకాల గాజులు ...

రంగు రంగుల గాజులు 

పిల్లల కోసం గాజులు !

పెద్దలు ముచ్చటపడే గాజులు 

ప్రజా రంజకమైన గాజులు !!

-----------------------------     

--- ఫోటో లో....బేబీ ఆన్షి.నల్లి.


కామెంట్‌లు