రాధ మది....:--మొహమ్మద్ .అఫ్సర వలీషా-- ద్వారపూడి (తూ గో జి )

 హే కృష్ణా......
నా కనుల కొలనులో 
నిను చూసిన అర క్షణం....
కలల దోసిళ్ళలో ఈత
రానివైనాయి నా చూపులు....
నీ వేణు గానంతో 
హృదయ ఫలకాన్ని 
సుతిమెత్తగా మీటాయి...
నీ ప్రేమ పూరిత చూపులతో
 లలితంగా మదిని
 మేధోమథనం చేసాయి....
నీ అందమైన సిరిమువ్వల 
అడుగుల సవ్వడి
అడుగడుగునా నాలో మోహన
రాగాలు జనియించాయి .....
నిను చూసిన ఆ తొలి పొద్దు
ఉదయ కిరణాలలో ఒక
చూపులోనే వేయి అర్ధాల
 భావనలు మదిలో మ్రోగెనులే ....
నా ముగింపు జీవిత కధ లో
 చివరి క్షణం వరకు 
నీ శ్వాస నై జీవిస్తా....
హే కృష్ణా నను 
నీ చల్లని కనుల కొలనులో 
నిత్యం కలువ వలె పూయించు .....
కాంతులీనే బృందావని లో
 కలకాలం కరుణ కాంతులు
 నాపై వెదజల్లు .....!!