యుగానికొక్కడు:---వేముల ప్రేమలత--: హైదరాబాద్

 ఎక్కడో సప్త సముద్రాలు ఆవల  చికాగో లోని 
నీ ప్రసంగం చాటి చెప్పెను *భారత దేశ ఔన్నత్యం*
రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యునిగా
 ప్రసిద్ది పొందిన ఆధ్యాత్మిక వేత్తగా
ప్రపంచానికి  సుపరిచితం
సకల సందేహాలకు సమాధానమై నిలిచే *భగవద్గీత* తనకు ఆదర్శం అన్నారు
గురు దక్షిణగా "రామకృష్ణ మఠం" స్థాపించిన ధన్య జీవి
పర భాషా వ్యామోహంలో చిక్కుకున్న యువత కు  స్ఫూర్తి నింపె తన సుక్తులతో 
తన ఉపన్యాసాలతో ఎంతటివారినైనా మంత్ర ముగ్ధులను చేయగల *వాక్చాతుర్యం* ఆయన సొంతం
మానవత్వమే మతమని చెప్పి  యువతకు ఆదర్శంగా నిలిచారు
తేజోమయ రూపం, వికాసవంతమైన వ్యక్తిత్వం
అతి చిన్న వయసులోనే మరణించినా *చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన జీవితం వివేకానందుడిది*