సెలవుల తరువాత ఆద్యకు డే కేర్ ప్రారంభమైంది. డే కేర్ వెళ్లడమంటే ఆద్యకు చాలా ఇష్టం, మళ్ళీ తన స్నేహితులను కలుసుకుంటానన్న ఆనందం తెల్లవారగానే రెడీ అయ్యి వెళ్ళింది. పెద్ద వాళ్లకు ఆఫీస్ లు కూడా ఈ రోజు ప్రారంభమయ్యాయి.వాతావరణ మార్పుల వలన కావచ్చు అందరికి జలుబు చేసింది, ఆరియా కు ముక్కు ఆగకుండా కారుతుంది. ఆద్య, ఆరియాకు ఐస్ క్రీం అంటే చాలా ఇష్టం, . ఐస్ క్రీం ఎవరికి కావాలి అనగానే ఆరియా, ఆరియా అని అంటూ అరుస్తుంది. . మామయ్య ఐస్ క్రీం తేగానే ఇద్దరు తినేశారు. యెంత వద్దన్నా వినలేదు. సాయం కాలం వరకు ఆరియాకు జలుబు పెరిగింది. రాత్రి కాస్త జ్వరం కూడా వచ్చింది.ఆరియా పుట్టిన రోజు దగ్గరికి వస్తుంది. ఏం చేయాలి అని అందరూ ఆలోచిస్తున్నారు. సంక్రాంతిపండుగ , గోదా కళ్యాణం కూడా దగ్గర పడుతుంది. అందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి .(మరిన్ని ముచ్చట్లు రేపు )
'' ఆ'' ఇద్దరు : టి. వేదాంత సూరి