శ్రీ కృష్ణ శతకము - పద్యం (౩౪ - 34)

 కందము :
*చుక్కలకుక్షిని నిఖిల జగంబులు*
*నిక్షేపముజేసి ప్రళయ | నీరధి నడుమన్*
*రక్షక వటపత్రముపై*
*దక్షత పవళించునట్టి | ధన్యుఁడు కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
సకల లోకాలకు రక్షకుడవు అయిన  నీవు, సకల భువనాలను నీ కడుపులో దాచుకున్నావు. అదే నువ్వు, మహా సముద్రం మధ్య లో మర్రి ఆకు మీద ఆకు నీటిలో మునిగి పోకుండా, సుఖంగా పవళించావు ......అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
 *"తెప్పగా మర్రాకు మీద"*,  *"వటపత్ర సాయికి, వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి"... అంటూ ఆ "దివ్య సుందర మూర్తిని"* వేడుకొందాము.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss