అల్లరి కృష్ణుడు(బాల గేయం)-ఎడ్ల లక్ష్మి--సిద్దిపేట--ఫోన్ నెంబర్ : 8466850674

 అల్లరి చేయక కృష్ణయ్యా 

ఆడుతు పాడుతు రావయ్యా


గోపికలంతా వచ్చారు 

గోవు పాలు తెచ్చారు 

పాలుతాగి కృష్ణయ్యా 

పాటలు నీవు పాడయ్యా  //అల్లరి//


కన్నె పిల్లలు వచ్చారు

వెన్నముద్దలు తెచ్చారు 

కళ్ళు తెరచి చూడయ్యా

తెచ్చిన వెన్న తినవయ్యా //అల్లరి//


ముద్దుల పాప వచ్చింది

మురళి పట్టుకొచ్చింది

మురిపాల కృష్ణ రావయ్యా

 మురళి నీవు ఊదయ్యా //అల్లరి//


చిన్న పిల్లలు వచ్చారు

నెమలి ఈకలు తెచ్చారు

నవ్వుల జల్లులు కురిపిస్తూ

విశ్వరూపము చూపయ్యా //అల్లరి//


కామెంట్‌లు