బాసర( బాల గేయం )-మమత ఐల--హైదరాబాద్--9247593432


 పిల్లలు చక్కగ కూర్చోండి

మంచి మాటలు నేర్వండి

విహారయాత్రకు వెళదామ

బాసరచుట్టి వద్ధామ


బాసరలోన వుంటుంది

చదువుల తల్లి సరస్వతి

పుణ్య తీర్థమని అంటారు

శ్రీకారం పెట్టిస్తారు


అక్కడ సెలయేరుంటుంది

గలగల పారుతు వుంటుంది

గోదావరియని పిలిచేరు

పుణ్య స్నానాలుచేసేరు


వాల్మీకి ఋషి గుహవుంది

చూడ చక్కని వనముంది

సరస్వతీ కోనేరుంది

చూడముచ్చటగ వుంటుంది


పాఠశాలబస్సొస్తుంది

ప్రొద్ధు పొద్ధునే రారండి


కామెంట్‌లు